Moinabad Crime: ఫాంహౌస్ వద్ద జంట హత్యలు.. అప్పు ఇచ్చిన మహిళలను తీసుకొచ్చి..
Moinabad Farmhouse Crime: హైదరాబాద్ శివారులోని ఫాంహౌస్ వద్ద జంట హత్యల కలకలం రేగింది. మెయినాబాద్ లో ఉన్న ఓ ఫామ్ హౌస్ లో తాండూరుకు చెందిన ఇద్దరు మహిళల శవాలు బయటపడ్డాయి.
Hyderbad Two Elderly Women Found at Moinabad Farmhouse
Moinabad Crime: హైదరాబాద్ శివారులోని ఫాంహౌస్ వద్ద జంట హత్యల కలకలం రేగింది. మెయినాబాద్ లో ఉన్న ఓ ఫామ్ హౌస్ లో ఇద్దరు వృద్ధ మహిళల శవాలు బయటపడ్డాయి. తాండూరుకు చెందిన ఇద్దరు మహిళల నుంచి కొందరు అప్పులు తీసుకున్నారు. కానీ, వాటిని తిరిగి చెల్లించే పరిస్థితి లేదు. దీంతో ఆ అప్పు ఇచ్చిన మహిళలను హత్య చేయాలని పథకం పన్నారు. తాండూరులో వారిని కిడ్నాప్ చేసి అనంతరం వారిని మొయినాబాద్ ఫాంహౌస్ కు తీసుకొచ్చి చంపేశారు.
Also Read : బండి భగీరథ్ కేసులో మరో బిగ్ ట్విస్ట్.. పోలీసులు కీలక నిర్ణయం.. ఈసారి పకడ్బందీగా..
అనంతరం శవాల ఆనవాళ్లు బయటకు రాకుండా వాటిని గొయ్యి తవ్వి శవాల్ని పూడ్చి పెట్టేశారు. బాధిత మహిళల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఫాంహౌస్ కు చేరుకున్న పోలీసులు మొదట శవాలను బయటకు తీయిస్తున్నారు. వాటిని ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహిస్తారు. ఫాంహౌస్ లో నిందితుల ఆచూకీకి సంబంధించిన ఆనవాళ్లు దొరుకుతాయేమోనని వెతుకుతున్నారు.
