Revanth Reddy : మీ పాలనపై నమ్మకం ఉంటే గజ్వేల్‌లో పోటీ చేయాలి- సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి సవాల్

కాంగ్రెస్ శ్రేణులారా.. వంద రోజులు కష్టపడండి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. Revanth Reddy

Revanth Reddy(Photo : Google)

Revanth Reddy – CM KCR : తెలంగాణ రాజకీయాలు హీట్ ఎక్కాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. నాయకులు ఒకరిపై మరొకరు విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు. సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. అప్పుడే ఎన్నికల మూడ్ కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలిచేది మేమే, రాబోయేది మా ప్రభుత్వమే అని ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు. మీ పాలనపై మీకు నమ్మకం ఉంటే గజ్వేల్ లో పోటీ చేయాలని కేసీఆర్ ను చాలెంజ్ చేశారు రేవంత్ రెడ్డి.

”గద్వాల జిల్లా బంగ్లాలో బందీ అయ్యింది. గద్వాల ప్రజలను బంగ్లా ముందు బానిసలుగా మార్చారు. గద్వాల జిల్లా కాంగ్రెస్ కు కంచుకోట. కొందరు నేతలు బీఆర్ఎస్ లోకి, మరొకరు బీజేపీలోకి పోయినంత మాత్రాన కాంగ్రెస్ బలహీనపడదు. బలహీన వర్గాలు ఎప్పుడూ కాంగ్రెస్ వైపే. ఈసారి గద్వాల జిల్లాలో కాంగ్రెస్ జెండా ఎగురుతుంది. కేసీఆర్ బలమైన నాయకులను ఒక్కొక్కరిగా అడ్డు తొలగించుకున్నారు.

Also Read..Telangana Politics: బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మైండ్‌గేమ్‌.. తెరవెనుక రాజకీయంలో మూడూ మూడే!

పాలమూరు బిడ్డకు సోనియా గాంధీ పీసీసీ ఇచ్చి గౌరవించారు. పాలమూరు వెనకబడ్డ జిల్లా కాదు. వెనుకబడిన వారిని నడిపించే జిల్లా అని చాటాలి. గద్వాలలో కాంగ్రెస్ జెండా ఎగరాలి. పాలమూరు జిల్లాలో 14కు 14 స్థానాల్లో కాంగ్రెస్ ను గెలిపించుకుందాం. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పాలమూరు ఎత్తిపోతల పూర్తి చేసుకుందాం. సీఎం కేసీఆర్ కు నేను సవాల్ విసురుతున్నా.

కేసీఆర్ కు తన పాలనపై నమ్మకం ఉంటే కేసీఆర్ గజ్వేల్ లో పోటీ చేయాలి. సిట్టింగులందరికీ సీట్లు ఇవ్వాలి. కాంగ్రెస్ శ్రేణులారా.. వంద రోజులు కష్టపడండి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు సంక్షేమ ఫలాలు” అని రేవంత్ రెడ్డి అన్నారు.

Also Read..Pension Hike : భారీగా పెన్షన్ పెంపు.. ప్రభుత్వం గుడ్ న్యూస్, జీవో జారీ