×
Ad

చలికి ఇప్పటికే వణికిపోతున్న ప్రజలు.. ఈ ప్రాంతాల్లో చలి తీవ్రత మరింత పెరగనుందంటూ ఐఎండీ హెచ్చరిక

ఆయా ప్రాంతాల్లో పగలతో పాటు రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా రికార్డు అవుతాయని ఐఎండీ చెప్పింది. 

Weather Updates: చలి తీవ్రత అధికం కావడంతో దేశంలోని అనేక ప్రాంతాల ప్రజలు వణికిపోతున్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో చలి తీవ్రత ఊహించిన దాని కంటే అధికంగా ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.

తెలంగాణ, ఉత్తర కర్ణాటకతో పాటు మధ్య, వాయవ్య, పశ్చిమ, తూర్పు భారతంలోని పలు ప్రాంతాల్లో రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరగనుంది. ఈ నెల నుంచి ఫిబ్రవరి వరకు ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయన్న వివరాలపై భారత వాతావరణ శాఖ ఐఎండీ ఓ రిపోర్టు రిలీజ్ చేసింది. (Weather Updates)

Also Read: New year 2026: న్యూ ఇయర్ వేడుకలకు ప్లాన్‌ చేశారా? మీకో బ్రేకింగ్ న్యూస్

ఆయా ప్రాంతాల్లో పగలతో పాటు రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా రికార్డు అవుతాయని చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌లో పగటితో పాటు రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం లేదా అంత కంటే అధికంగా రికార్డు అవుతాయని పేర్కొంది. ఈ నెల దక్షిణాదిన సాధారణం లేదా అంతకంటే అధికంగా వర్షపాతం రికార్డు అవుతుందని చెప్పింది.

ఉత్తర కోస్తాలో సాధారణం కంటే అధికంగా, ఏపీలోని మిగతా ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం రికార్డు అవుతుందని తెలిపింది. ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురవడంతో ఇప్పటికే వాతావరణం చల్లబడింది. దానితో పాటు లా నినా ప్రభావంతో చలి గాలులు పెరుగుతాయని ఐఎండీ చెప్పింది. చలి పెరగడంతో వృద్ధులు, చిన్నారులతో పాటు గుడిసెల్లో నివసించే సంచార జాతుల వారు సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపింది.