New year 2026: న్యూ ఇయర్ వేడుకలకు ప్లాన్ చేశారా? మీకో బ్రేకింగ్ న్యూస్
న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే పర్మిషన్ తీసుకోవాల్సిందేనని పోలీసులు మళ్లీ చెప్పారు.
New Year 2026: న్యూ ఇయర్ వేడుకలకు చాలామంది ఇప్పటి నుంచే ప్లాన్‌లు వేసుకోవడం మొదలుపెట్టారు. భారీ సెలబ్రేషన్స్ నిర్వహించుకోవాలంటే ఆ మాత్రం ప్లానింగ్ ఉండాలి. సాధారణంగా డిసెంబర్ 31న సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు వేడుకలు చేసుకుంటారు.
కొన్ని చోట్ల సమయం మించిపోయినప్పటికీ సెలబ్రేషన్స్ కొనసాగుతూనే ఉంటాయి. ఇతరులకు ఇబ్బంది కలుగుతుందన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా చాలా మంది నానా హంగామా చేస్తారు. డీజే సౌండ్స్‌తో హోరెత్తిస్తుంటారు.
మద్యం తాగి కేకలు వేస్తూ వింత జీవుల్లా ప్రవర్తిస్తారు. ఇటువంటి వారిని అదుపుచేసేందుకు పోలీసులు ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తుంటారు. న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే పర్మిషన్ తీసుకోవాల్సిందేనని పోలీసులు మళ్లీ చెప్పారు. డిసెంబర్ 31న నిర్వహించే సెలబ్రేషన్స్‌కు ముందస్తు అనుమతులు తప్పనిసరని సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి తెలిపారు.
Also Read: రైతుల కష్టాలు తీరనున్నాయ్.. రూ.295 కోట్లతో 2.91 లక్షల టన్నుల స్టోరేజీతో వీటి నిర్మాణం..
ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీల నిర్వాహకులు ఈ నెల 21 లోపు cybpms.telangana.gov.inలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ సమయం తర్వాత వచ్చే దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోరు. టికెట్ ఈవెంట్లకు కమర్షియల్/టికెటెడ్ ఫామ్ ఆప్షన్ ఉంటుంది.
కాగా, న్యూ ఇయర్ హోటళ్లు, పబ్బులు, ఈవెంట్ల నిర్వాహకులు పాటించాల్సిన నిబంధనలను కూడా పోలీసులు విడుదల చేయనున్నారు. ఇక న్యూఇయర్ పేరుతో డ్రగ్స్ తీసుకుంటే పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారు.
