జన్వాడ ఫామ్‌హౌస్ కూల్చివేతకు హైడ్రా రెడీ..? రంగంలోకి ఇరిగేషన్ అధికారులు..

జన్వాడ ఫామ్ హౌస్ కి సంబంధించి కొన్ని రోజులుగా విస్తృతంగా చర్చ జరుగుతోంది. జన్వాడ ఫామ్ హౌస్ ను కూలగొట్టే అవకాశం ఉందని హైకోర్టును ఆశ్రయించారు.

Janwada Farm House : జన్వాడ ఫామ్ హౌస్ లో ఇరిగేషన్ అధికారులు సర్వే చేపట్టారు. ఫామ్ హౌస్ కొలతలు తీసుకున్నారు. తర్వాత హైడ్రా కూడా రంగంలోకి దిగనుందని సమాచారం. జన్వాడ ఫామ్ హౌస్ దగ్గర ఇరిగేషన్ అధికారులు సర్వే చేయడం, కొలతలు తీసుకోవడం, బౌండరీస్ ఫిక్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. నెక్ట్స్ ఏం జరగనుంది? అనేది ఆసక్తికరంగా మారింది.

చెరువుల ఆక్రమణలపైన రేవంత్ సర్కార్ సీరియస్ గా ఫోకస్ పెట్టింది. ఎక్కడైతే చెరువులను ఆక్రమించి ఎఫ్ టీఎల్ కానీ బఫర్ జోన్ లో కానీ నిర్మాణాలు చేపట్టారో.. ఆ అంశంలో రేవంత్ ప్రభుత్వం సీరియస్ గా దృష్టి కేంద్రీకరించింది. చెరువులను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను నేలమట్టం చేస్తున్నారు. చెరువులను కాపాడటమే తమ ప్రధాన లక్ష్యం అని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి అక్రమ కట్టడాలు నిర్మించిన వాటిని కూలగొట్టేందుకు ప్రత్యేకంగా హైడ్రాను రూపొందించింది రేవంత్ ప్రభుత్వం. ఇప్పటికే హైడ్రా తన పనిని ముమ్మరం చేసింది. అక్రమ కట్టడాలను గుర్తించి నేలమట్టం చేస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం 18 చోట్ల అక్రమ నిర్మాణాలను కూలగొట్టింది. దాదాపు 46 ఎకరాలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రభుత్వానికి నివేదిక కూడా ఇచ్చింది.

ఇక మాజీ మంత్రి కేటీఆర్ కు సంబంధించినది చెబుతున్న జన్వాడ ఫామ్ హౌస్ అంశం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఇరిగేషన్ అధికారులు జన్వాడ ఫామ్ హౌస్ వద్దకు వెళ్లి సర్వే చేశారు. గండిపేట పరిధిలోకి వచ్చే ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ పరిధికి సంబంధించి సర్వే చేసి అక్కడ బౌండరీస్ ఫిక్స్ చేశారు. కాసేపట్లో హైడ్రా కూడా రంగంలోకి దిగే అవకాశం ఉందని తెలుస్తోంది. జన్వాడ ఫామ్ హౌస్ ను కూలగొట్టే అవకాశం ఉందని సమాచారం.

Also Read : ఏపీలో వైసీపీతో, తెలంగాణలో బీఆర్‌ఎస్‌తో స్నేహమే దెబ్బతీసిందా? నాగార్జునపై సీఎం రేవంత్‌కు కోపమెందుకు..!

ఆ ప్రాంతాన్ని మళ్లీ పరిరక్షణ పరిధిలోకి తీసుకురావాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. జన్వాడ ఫామ్ హౌస్ కి సంబంధించి కొన్ని రోజులుగా విస్తృతంగా చర్చ జరుగుతోంది. జన్వాడ ఫామ్ హౌస్ ను కూలగొట్టే అవకాశం ఉందని హైకోర్టును ఆశ్రయించారు. ఫామ్ హౌస్ ను కూలగొట్టకుండా స్టే ఇవ్వాలని కోరారు. ఈ వ్యవహారంలో లీగల్ గా ముందుకెళ్లాలని అధికారులకు కోర్టు సూచించింది.

 

ట్రెండింగ్ వార్తలు