Gutta Sukhender Reddy : మూడో సారి కేసీఆర్ సీఎం కావడం ఖాయం : గుత్తా సుఖేందర్ రెడ్డి

2018 ఎన్నికల్లో పొంగులేటి బీఆర్ఎస్ లో ఉండి ఎన్ని గెలిపించారని ప్రశ్నించారు. గతం కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Gutta Sukhender Reddy

CM KCR Third Time : తనకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదని.. పార్టీ అవకాశం ఇస్తే.. అమిత్ ఫొటీ చేస్తారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. ముందు అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని తెలిపారు. జిల్లాలో కొంత మంది కాంగ్రెస్ పార్టీ నేతలు బీఆర్ఎస్ లో చేరడం ఖాయమన్నారు. ఈ మేరకు గుత్తా సుఖేందర్ రెడ్డి శుక్రవారం మీడియాతో చిట్ చాట్ చేశారు. ఒక్క నేత పార్టీ మారినా ఆ పార్టీకి నష్టం జరుగుతుందని చెప్పారు. కొంతమంది పార్టీని విడితే పార్టీకి లాభం కూడా జరుగుతుందని తెలిపారు.

జనంలో ఉన్న నేతలు పార్టీని విడితే నష్టమేనని పేర్కొన్నారు. మూడో సారి కేసీఆర్ సీఎం కావడం ఖాయమన్నారు. రాష్ట్రంపై కేసీఆర్ కు ఉన్న అవగాహన ఎవరికీ లేదని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ లో చేరుతామంటున్న నేతలు.. తమకు తాము పెద్దగా ఊహించుకుంటున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ మూడో సారి సీఎం అయితే కేటీఆర్ మంత్రిగా ఉంటారని తెలిపారు. రాజకీయాల్లో వంద శాతం ఎవరిపైనా సంతృప్తి ఉండదు….ఇది సహజం అన్నారు.

Bonda Uma Maheshwar Rao : శ్రీవాణి ట్రస్టు నిధులపై శ్వేతపత్రం.. బోండా ఉమా సంచలన ఆరోపణలు

ఎన్నికలు వచ్చే వరకు కాంగ్రెస్, బీజేపీలు కిందకు వెళ్లడం ఖాయమని ఎద్దేవా చేశారు. ఎన్నికలు వచ్చిన సమయంలో అన్ని పార్టీలకు వచ్చే వాళ్ళు, పోయే వాళ్ళు ఉంటారని పేర్కొన్నారు. 2018 ఎన్నికల్లో పొంగులేటి బీఆర్ఎస్ లో ఉండి ఎన్ని గెలిపించారని ప్రశ్నించారు. గతం కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ తో బీఆర్ఎస్ లేకపోవడంతోనే బీహార్ మీటింగ్ కు ఆహ్వానం లేదన్నారు.

కేజ్రీవాల్ కండిషన్లు పెట్టి సమావేశానికి హాజరు అయ్యారని పేర్కొన్నారు. వారసుల కోసం ఎవరు పార్టీలు మారినా తాను మారేది లేదని స్పష్టం చేశారు. తన కొడుకుకు పార్టీ అవకాశం ఇస్తే పోటీ చేస్తారు… లేదంటే బీఆర్ఎస్ గెలుపుకు పని చేస్తారని హామీ ఇచ్చారు. వారసులకు పొలిటికల్ ఎంట్రీ కోసం గుర్తింపు మాత్రమే దక్కుతుందన్నారు. కేసిఆర్ కు రాష్ట్ర అభివృద్ధి, రాజకీయం తప్ప వేరే అవసరం లేదన్నారు.

ట్రెండింగ్ వార్తలు