Malla Reddy: మాజీ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు

ఇంజనీరింగ్, మెడికల్ సీట్ల విషయంలో ఆయన విద్యార్థుల నుంచి భారీగా డబ్బులు వసూళ్లు చేసినట్లుగా ఆరోపణలతో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి.

Malla Reddy

తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఇంజనీరింగ్, మెడికల్ సీట్ల విషయంలో ఆయన విద్యార్థుల నుంచి భారీగా డబ్బులు వసూళ్లు చేసినట్లుగా ఆరోపణలతో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి.

విద్యార్థుల నుంచి వచ్చిన డబ్బును ఆదాయ పన్నులలెక్కలను నిబంధనలను అనుగుణంగా చూపించకపోవడంతో ఐటీ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మల్లారెడ్డి కూమారుడు భద్రారెడ్డి నివాసంలోనూ ఐటీ సోదాలు జరుగుతున్నాయి. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: 50 మందితో వెళ్తూ.. రష్యాలో కూలిన అంగారా ఎయిర్‌లైన్స్‌ విమానం.. కాలిపోయిన స్థితిలో శకలాల గుర్తింపు

మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి బీజేపీలో చేరనున్నట్లు ఇటీవల ప్రచారం జరిగింది. హైదరాబాద్‌లోని పాతబస్తీలో జరిగిన బోనాల వేడుకల్లో బీజేపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. అందులో బండి సంజయ్, ప్రీతిరెడ్డి ఫొటోలు ఉన్నాయి.

ఆ తర్వాతి రోజు హైదరాబాద్ ఓ బీజేపీ నేత ఇంట్లో నిర్వహించిన లంచ్‌కు కూడా బండి సంజయ్, ప్రీతిరెడ్డి హాజరయ్యారు. దీంతో ఆమె బీజేపీలో చేరనున్నారని ప్రచారం జరిగింది. ఇప్పుడు వారి ఇళ్లలో ఐటీ సోదాలు జరుగుతుండడం గమనార్హం.