50 మందితో వెళ్తూ.. రష్యాలో కూలిన అంగారా ఎయిర్‌లైన్స్‌ విమానం.. కాలిపోయిన స్థితిలో శకలాల గుర్తింపు

విమానంలోని వారంతా చనిపోయి ఉంటారని రష్యా అధికారిక చానెల్ ఆర్టీ తెలిపింది.

50 మందితో వెళ్తూ.. రష్యాలో కూలిన అంగారా ఎయిర్‌లైన్స్‌ విమానం.. కాలిపోయిన స్థితిలో శకలాల గుర్తింపు

Updated On : July 24, 2025 / 2:58 PM IST

రష్యాలో అంగారా ఎయిర్‌లైన్స్‌ విమానం కూలింది. ప్రమాద సమయంలో అందులో దాదాపు 50 మంది ఉన్నారు. రష్యా తూర్పు ప్రాంతంలో AN-24 విమానం శకలాలు కాలిపోయిన స్థితిలో కనపడ్డాయి.

ఆ విమానం చైనా సరిహద్దుకు సమీపంలో ఉన్న అమూర్ ప్రాంతంలోని టిండా పట్టణానికి చేరువగా ఉన్న సమయంలో ఏటీసీతో  దాని సంబంధాలు తెగిపోయాయి.

Also Read: మనీలాండరింగ్‌ కేసు.. అనిల్ అంబానీ కంపెనీల్లో ఈడీ సోదాలు

అమూర్ గవర్నర్ వాసిలీ ఓర్లోవ్ తెలిపిన వివరాల ప్రకారం.. విమానంలో ఐదుగురు చిన్నారులు, ఆరుగురు సిబ్బంది సహా 43 మంది ప్రయాణికులు ఉన్నారు. టిండాలోని ఎయిర్‌పోర్టులో ఆ విమానం దిగాల్సి ఉండగా, దానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న సమయంలో సిగ్నల్స్ రాలేదని అధికారు తెలిపారు.

ప్రస్తుతం ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు, విమానంలోని వారంతా చనిపోయి ఉంటారని రష్యా అధికారిక చానెల్ ఆర్టీ తెలిపింది.