IT searches
IT searches: తెలుగు రాష్ట్రాల్లో ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. రెండు రాష్ట్రాల్లోని పలు వస్త్ర దుకాణాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలిలో తదితర ప్రాంతాల్లోని కళామందిర్, కేఎల్ఎం, వరమహాలక్ష్మీ షో రూమ్స్‌తోపాటు.. ఓనర్స్ ఇళ్లపై ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తం 20 ప్రాంతాల్లో ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 40 బృందాలుగా విడిపోయి ఈ సోదాలు చేస్తున్నారు.
AP CID Searches : ఏపీ మాజీ మంత్రి నారాయణ, ఆయన కుటుంబసభ్యుల ఇళ్లలో సీఐడీ సోదాలు
ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి తదితర ప్రాంతాల్లోని కళామందిర్, వరమహాలక్ష్మి షో రూమ్‌లలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. బృందాలుగా విడిపోయి వివిధ ప్రాంతాల్లో ఏక కాలంలో సోదాలు జరుపుతున్నారు. విజయవాడ వరమహాలక్ష్మీలో మూడు ప్రత్యేక బృందాలతో సోదాలు కొనసాగుతున్నాయి. సాఫ్ట్ కాపీ, హార్డ్ కాపీలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఐటీ ఉల్లంఘనలపై ఆరా తీస్తున్నారు. జీఎస్టీ లావాదేవీలను ఐటీలో చూపిస్తున్నారో లేదోనని అధికారులు పరిశీలిస్తున్నారు.