బీజేపీ 420 పార్టీ.. చీటింగ్ కేసు పెట్టాలి: కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి

ఎన్నికల ముందు మతాన్ని రెచ్చగొట్టి ఎన్నికలు అయిపోగానే ప్రజలని దూరం పెట్టే పార్టీ బీజేపీ అని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విమర్శించారు.

Jagga Reddy: బీజేపీ ఒక 420 పార్టీ అని, దేవుడి గుడిని కూడా తన రాజకీయాలకు వాడుతోందని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విమర్శించారు. సోమవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలని మోసం చేసినందుకు బీజేపీపై చీటింగ్ కేసు పెట్టాలని అన్నారు. రాముడి పేర్లు చెప్పి ఓట్లు అడగడం తప్పా, పేదల కడుపు నింపి ఓట్లు అడుగుతుందా అని ప్రశ్నించారు.

”ఎన్నికల కోసమే అయోధ్య రామమందిరాన్ని హడావిడిగా ప్రారంభించారు. రాముడు, హనుమంతుడి పేర్లు చెప్పి యువకులను బీజేపీ రెచ్చగొడుతోంది. ఎన్నికల ముందు మతాన్ని రెచ్చగొట్టి ఎన్నికలు అయిపోగానే ప్రజలని దూరం పెట్టే పార్టీ బీజేపీ. మతాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం మా విధానం కాదు. బీజేపీ పుట్టినాకనే దేవుళ్ళని మొక్కే పద్దతి మొదలైనట్టు చేస్తున్నారు. నిత్యావసరాల ధరల పెరుగుదల చర్చ పక్కకి పోవడానికే మతాన్ని వాడుకుంటున్నార”ని జగ్గారెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ తమది సెక్యులర్ పార్టీ అని చెప్తుంది కానీ మత రాజకీయాలే చేస్తుందని ఆరోపించారు.

పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ 17 సీట్లు గెలవాలని టార్గెట్ పెట్టుకున్నామని జగ్గారెడ్డి తెలిపారు. హైదరాబాద్ ఎంపీ స్థానాన్ని తామే గెలుస్తామని, అసదుద్దీన్ ఓవైసీకి గట్టి పోటీ ఇచ్చే వ్యక్తికి టికెట్ ఇస్తామని చెప్పారు. హైదరాబాద్ స్థానాన్ని కాంగ్రెస్ గెలిస్తే నిజమైన అచ్చే దిన్ వస్తుందని వ్యాఖ్యానించారు.

Also Read: కవితను అరెస్టు చేస్తామని ఎప్పుడూ అనలేదు.. సీబీఐ, ఈడీతో బీజేపీకి సంబంధం లేదు : బండి సంజయ్

కేటీఆర్‌పై జగ్గారెడ్డి సెటైర్లు
కేసీఆర్‌కి కాంగ్రెస్ సంప్రదాయం తెలుసుసని.. కేటీఆర్‌కి ఏం తెలియదని జగ్గారెడ్డి అన్నారు. కేటీఆర్ తండ్రిచాటు బిడ్డ .. మొన్నటి వరకు సీఏం కొడుకు, ఇప్పుడు మాజీ సీఏం కొడుకు అంటూ సెటైర్లు వేశారు. ముందే ముఖ్యమంత్రిని ప్రకటించే సంప్రదాయం కాంగ్రెస్ పార్టీలో లేదని గుర్తు చేశారు.

ట్రెండింగ్ వార్తలు