×
Ad

జగిత్యాలలో ఆరని మంటలు.. సొంత పార్టీపైనే మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శలు.. ఏం జరుగుతోంది?

ప్రతిప‌క్షంలో ప‌దేండ్లు క‌ష్టప‌డి ప‌నిచేస్తే.. తీరా ఇప్పుడు తినే టైంలో మ‌రొక‌డు వ‌స్తే ఊకుంటామా? అంటూ కామెంట్స్ చేశారు.

Jeevan Reddy Vs Mla Sanjay

Jagityala Congress: జగిత్యాల జగడం మళ్లీ తెరమీదకు వచ్చింది. ఎమ్మెల్యే సంజయ్ రాకపై మొదటి నుంచి అసంతృప్తిగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఎప్పటికప్పుడు తన నిరసనను తెలియజేస్తూ వస్తున్నారు. మంత్రుల పర్యటనలు, పీసీసీ చీఫ్‌ ప్రోగ్రామ్‌..ఇలా కార్యక్రమం ఏదైనా..సంజయ్‌కి వ్యతిరేకంగా పార్టీ తీరుపై తన గళం వినిపిస్తున్నారు.

ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల వేళ మరోసారి బరస్ట్ అయ్యారు జీవన్‌రెడ్డి. సంజయ్‌ పార్టీలోకి వచ్చినప్పటి నుంచి..సీనియర్ నేతనైన తనను పట్టించుకోవడం లేదన్న కారణంతోనే జీవన్‌రెడ్డి రగిలిపోతున్నారట. ఎమ్మెల్యే సంజయ్‌కి పార్టీ, ప్రభుత్వం సపోర్ట్ చేస్తుండటంతో…జగిత్యాల్‌లో ఆయన మాటే చెల్లుబాటు అవుతుందట.. ఇదే జీవన్ రెడ్డికి అస్సలు మింగుడు పడటం లేదట. ఇంతకాలం తనమాట చెల్లుబాటు అయిన చోట..మరొకరి అజామాయిషీ ఏంటని ఎప్పటికప్పుడు ఫ్రస్టేట్‌ అవుతున్నారట.

Also Read: మిథున్‌రెడ్డికి బిగ్ రిలీఫ్‌.. వైసీపీకి బూస్టప్‌ ఇవ్వబోతోందా?

అందుకే సందు దొరికినప్పుడల్లా సమయం చూసి మరీ ఎమ్మెల్యే సంజయ్‌ని టార్గెట్ చేస్తూ..పనిలో పనిగా అటు ప్రభుత్వం, ఇటు పార్టీపై అటాక్ చేస్తున్నారట. లేటెస్ట్‌గా జీవన్‌రెడ్డి చేసిన కామెంట్స్‌ చర్చకు దారి తీశాయి. అధికారం వచ్చాక వచ్చిన వారిని తరిమికొట్టాలంటూ జీవన్ రెడ్డి ఘాటుగా రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్ లీడర్ అవ్వాంటే ఓపిక కావాలంలూ..తన సీనియారిటీ, సిన్సియారిటీకి తానే పెద్దపీఠ వేసుకునేలా హట్ కామెంట్స్ చేశారు.

ప్రతిప‌క్షంలో ప‌దేండ్లు క‌ష్టప‌డి ప‌నిచేస్తే.. తీరా ఇప్పుడు తినే టైంలో మ‌రొక‌డు వ‌స్తే ఊకుంటామా? అంటూ కామెంట్స్ చేశారు. అంతేకాదు పార్టీలోకి కొత్తగా దూరినోళ్లను త‌రిమికొట్టాలంటూ క్యాడ‌ర్‌కు పిలుపునిచ్చారు. పార్టీ కోసం క‌ష్టప‌డ్డ వారిని కాద‌ని కొత్తగా వ‌చ్చిన వారిని అంద‌ల‌మెక్కించ‌డ‌మేంటంటూ..పార్టీ నాయ‌క‌త్వం తీరు న‌వ్వుల‌ పాలు చేస్తుందని ఫైరయ్యారు. కాంగ్రెస్ కార్యక‌ర్తల శ్రమ‌ను వ్యర్థం చేస్తూ..ప‌దేండ్లు అధికార‌ంతో విర్రవీగిన వారిని ఇప్పుడు అక్కున చేర్చుకోవ‌డ‌మేంటంటూ సీరియస్ కామెంట్స్ చేశారు జీవన్‌రెడ్డి. స్థానిక ఎన్నికల వేళ కష్టపడ్డ క్యాడర్‌కు గుర్తింపు లేదని జీవన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీస్తున్నాయి.

ఎమ్మెల్యే వర్గానికి ఎక్కువ టికెట్లు ఇచ్చే అవకాశం ఉండటంతోనే జీవన్‌రెడ్డి మరోసారి బరస్ట్ అయ్యారన్న టాక్ వినిపిస్తోంది. స్థానిక పోరులో తన వర్గం నేతలను ఎంపీటీసీ, జడ్పీటీలుగా గెలిపించుకోవాలని పెద్దాయన స్కెచ్ వేశారట . అయితే ఇందులో భాగంగా జీవన్‌రెడ్డి సొంత పార్టీపై విమ‌ర్శలు గుప్పించ‌డంతో పాటు మాజీ సీఎం కేసీఆర్‌పై పొగ‌డ్తలు గుప్పించడం చర్చనీయాంశంగా మారింది.

కేసీఆర్‌ను జీవ‌న్‌రెడ్డి ఏ రీతిలో పొడిగారు?
అభివృద్ధి విష‌యంలో కేసీఆర్ స్వప‌క్షం, విప‌క్షం అనే తేడా లేకుండా వ్యవ‌హ‌రించారంటున్నారు. 2014లో సీఎం హోదాలో కేసీఆర్..క‌రీంన‌గ‌ర్‌లో స‌మీక్షా స‌మావేశం ఏర్పాటు చేస్తే..కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న త‌న ప్రసంగంతోనే మీటింగ్‌ను ప్రారంభించార‌ని జీవ‌న్‌రెడ్డి గుర్తు చేశారు. జ‌గిత్యాల అభివృద్ధిలో భాగంగా బోర్నవెల్లి-చిన్నబెల్లాల బ్రిడ్జి మంజూరు చేయాల‌ని కోరితే..ఐదు నిమిషాల్లో 70 కోట్ల రూపాయ‌లు శాంక్షన్‌ చేశారని అంటున్నారు. ఇలా మాజీ సీఎం కేసీఆర్‌ను జీవ‌న్ రెడ్డి పొగ‌డ్తల‌తో ముంచెత్తడంతో సంజయ్‌ వర్గం ఆగ్రహంతో రగిలిపోతోందట.

లోక‌ల్ బాడీ ఎన్నిక‌ల వేళ జీవన్‌రెడ్డి మళ్లీ వాయిస్ రేజ్‌ చేయడంతో..గ్రూప్ వార్‌ కాంగ్రెస్ పెద్దలకు హెడెక్‌గా మారిందట. జీవన్‌రెడ్డి సీనియర్ లీడర్. ఆయన వర్గానికి కాకుండా ఎమ్మెల్యేతో వచ్చిన వారికి స్థానిక ఎన్నికల్లో టికెట్లు ఇస్తే జీవన్‌రెడ్డి ఒప్పుకునే పరిస్థితి ఉండదు. పోనీ ఎమ్మెల్యే సంజయ్‌ వర్గం కూడా కాంప్రమైజ్ అయ్యే సిచ్యువేషన్ కనిపించడం లేదట.

ఓ వైపు పార్టీ సీనియర్ నాయకుడు..ఇంకోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరికి మద్దతు ఇవ్వాలో తెలియక నేతలు తలలు పట్టుకుంటున్నారట. ఒక్క జగిత్యాలలోనే కాదు..పార్టీ మారిన ఎమ్మెల్యేలున్న 10 నియోజకవర్గాల్లోనూ స్థానిక పోరు హస్తం పార్టీ ముఖ్యనేతలకు హెడెక్‌గా మారిందట. మొత్తానికి మళ్లీ మొదలైన జగిత్యాల జగడం స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ నావను ఏ ఎక్కడికి చేరుస్తుందో చూడాలి..