×
Ad

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల బరిలో జనసేన.. జన సైనికులకు పార్టీ కీలక ఆదేశాలు

తెలంగాణలో జనసేన పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పింది.

Jana Sena Party (Image Credit To Original Source)

  • తెలంగాణలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు
  • పోటీకి కార్యాచరణను ప్రారంభించిన జనసేన
  • సాధ్యమైనన్ని స్థానాల్లో పోటీచేయాలని నిర్ణయం  

Jana Sena Party: తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన కార్యాచరణను ప్రారంభించింది. సాధ్యమైనన్ని స్థానాల్లో పోటీచేయాలని జనసేన నిర్ణయం తీసుకుంది.

తెలంగాణలో సరికొత్త రాజకీయ వేదికకు బలమైన పూనాది వేస్తామంటూ జ‌నసేన ఓ ప్రకటనలో ఈ వివరాలు తెలిపింది. తెలంగాణలో జనసేన పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పింది.

Also Read: వీబీ జీ రామ్ జీ పథకంలో కొత్త మలుపు.. మనకు మరింత లాభం ఎలా దక్కుతుందంటే?

ఎన్నికలకు తక్కువ సమయం ఉండడంతో ప్రతి జనసైనికుడు, వీరమహిళ ఉత్సాహంగా ఎన్నికల ప్రచారానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చింది. త్వరలో ఎన్నికల పార్టీ కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపింది.

శిక్షణ కార్యక్రమం నిర్వహణ
తెలంగాణ జనసేన యువజన విభాగం అడ్ హక్ సభ్యులకు శిక్షణ కార్యక్రమం కూడా నిర్వహించింది. రాష్ట్రంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేసి, ప్రజల్లో పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలను బలంగా తీసుకెళ్లే లక్ష్యంతో ఈ ట్రైనింగ్ ఇచ్చారు. అలాగే, సభ్యులకు జనసేన పార్టీ కిట్‌ను అందించారు.