Lok Sabha Elections 2024: పంతం నెగ్గించుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి

ఇప్పటికే నాగార్జున సాగర్ ఎమ్మెల్యేగా జానారెడ్డి రెండవ తనయుడు కుందూరు జయవీర్ రెడ్డి ఉన్నారు.

JanaReddy

నల్గొండ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థిగా ఏఐసీసీ ఇవాళ కుందూరు రఘువీర్ రెడ్డి పేరును ప్రకటించింది. ఏఐసీసీ అన్ని రాష్ట్రాల్లో కలిపి మొత్తం 36 మంది పేర్లను తొలి జాబితాలో ప్రకటించిన విషయం తెలిసిందే. తొలి జాబితాలో తెలంగాణ నుంచి నలుగురి పేర్లు ఉండగా వారిలో రఘువీర్ రెడ్డి పేరు కూడా ఉంది.

దీంతో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి పంతం నెగ్గించుకున్నట్లు అయింది. జానారెడ్డి మొదటి తనయుడు రఘువీర్ రెడ్డి. నాగార్జున సాగర్, మిర్యాలగూడ నియోజకవర్గాల నుంచి గతంలో ఎమ్మెల్యే టికెట్ కోసం రఘువీర్ రెడ్డి ప్రయత్నాలు జరిపారు. ఇప్పటికే నాగార్జున సాగర్ ఎమ్మెల్యేగా జానారెడ్డి రెండవ తనయుడు కుందూరు జయవీర్ రెడ్డి ఉన్నారు.

నల్గొండ లోక్‌సభ స్థానం నుంచి టికెట్ ఆశించిన కాంగ్రెస్ నేత పటేల్ రమేశ్ రెడ్డికి నిరాశే మిగిలింది. గత ఎన్నికల్లో సూర్యాపేట టికెట్ ఆశించి రమేశ్ రెడ్డి భంగపడ్డారు. నల్గొండ ఎంపీ టికెట్ హామీతో రెబల్‌గా పోటీ నుంచి ఆయన తప్పుకున్నారు. కాగా, కాంగ్రెస్ తొలి జాబితాలో జహీరాబాద్ నుంచి సురేశ్ షెట్కార్, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్‌కు టికెట్ దక్కింది.

 Also Read: లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన కాంగ్రెస్.. తెలంగాణ నుంచి నలుగురి పేర్లు..

ట్రెండింగ్ వార్తలు