లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన కాంగ్రెస్.. తెలంగాణ నుంచి నలుగురి పేర్లు..

Lok Sabha Elections 2024: జహీరాబాద్ నుంచి సురేశ్ షెట్కార్, నల్లగొండ నుంచి కందుకూరు రఘువీర్..

లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన కాంగ్రెస్.. తెలంగాణ నుంచి నలుగురి పేర్లు..

Congress

కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల జాబితా విడుదలైంది. తెలంగాణలో జహీరాబాద్ నుంచి సురేశ్ షెట్కార్, మహబూబ్ నగర్ నుంచి వంశీ చందర్ రెడ్డి, నల్లగొండ నుంచి కందుకూరు రఘువీర్, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఏఐసీసీ జాబితా విడుదల చేసింది.

తొలి జాబితాలో తెలంగాణ నుంచి నలుగురి పేర్లు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ  మొత్తం కలిపి 39 మంది పేర్లను తొలి జాబితాలో ప్రకటించింది. కేరళలోని వయానాడ్ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తారు. గత ఎన్నికల్లోనూ రాహుల్ ఇక్కడి నుంచే పోటీ చేసి గెలిచారు. కర్ణాటకలోని శివమొగ్గ నుంచి గీతా శివకుమార్ పోటీ చేయనున్నారు. బెంగళూరు రూరల్ నుంచి డీకే సురేశ్ పోటీ చేస్తారు.

పూర్తి జాబితా

 

ఇంత పెద్ద స్కెచ్ వేసింది చంద్రబాబే: సజ్జల రామకృష్ణారెడ్డి