Madhavi Latha : పవన్ కళ్యాణ్ పోస్టు మతమార్పిళ్లను ప్రోత్సహించేలా ఉంది – మాధవీలత సంచలనం

పవన్ ఫేస్ బుక్ మెయింటైన్ చేసే వాళ్లు ఒళ్లు దగ్గర పెట్టుకుంటే మంచిదని మాధవీలత హెచ్చరించారు. ఓ హిందువుగా పవన్ చేసిన పోస్టుకు తాను బాధపడుతున్నా అని చెప్పారు.

Madhavi Latha : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సినీ నటి, బీజేపీ నేత మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ తీరు మతమార్పిడులను ప్రోత్సహించే విధంగా ఉందని ఆరోపించారు. అసలేం జరిగిందంటే.. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై మాధవీలత తీవ్రంగా స్పందించారు. పవన్ విషెస్ చెప్పిన తీరును తప్పుబట్టారు. పవన్ చేసిన పోస్టు.. మతమార్పిళ్లను ఎంకరేజ్ చేసేలా ఉందని విమర్శించారు. శుభాకాంక్షలు వరకు చెబితే తప్పు లేదన్న మాధవీలత, బైబిల్ ను బోధించాల్సిన అవసరం లేదని అన్నారు. పవన్ ఫేస్ బుక్ మెయింటైన్ చేసే వాళ్లు ఒళ్లు దగ్గర పెట్టుకుంటే మంచిదని మాధవీలత హెచ్చరించారు. ఓ హిందువుగా పవన్ చేసిన పోస్టుకు తాను బాధపడుతున్నా అని చెప్పారు.

RRR Movie : మళ్లీ వాయిదా?

‘పవన్ కళ్యాణ్ గారు క్రిస్మస్ విషెస్ చెప్పండి సంతోషం.. నమ్మిన వారికి విషెస్ అని చెప్పండి ఇంకా సంతోషం. మానవాళికి లాంటి పెద్ద మాటలు ఎందుకండి? మీ పోస్టు మతమార్పిళ్లను ఎంకరేజ్ చేసేలా ఉంది. విషెస్ పెట్టండి చాలు. బైబిల్ గురించి బోధించనక్కర్లేదు. రెస్పెక్ట్ ఇద్దాం అంతవరకే. మీ విషెస్ తప్ప మీరు రాసిన కంటెంట్ నాకు నచ్చలేదు’ అని తన ఫేస్ బుక్ లో మాధవీలత అన్నారు.

V-EPIQ Cinema Closed : ఏపీలో టికెట్ రేట్ల ఎఫెక్ట్.. బాహుబలి థియేటర్ మూసివేత

”మీ పేజ్ మెయింటైన్ చేస్తున్నవాళ్లు కొంచెం ఒళ్లు దగ్గర పెట్టుకోవడం మంచిది. మొన్న మీరు కూడా స్పీచ్‌లో బైబిల్ గురించి గొప్పగా చెప్పారు. మీరు కూడా కన్వర్షన్స్‌కు కారణం అవ్వొద్దు. చాలా బాధగా ఉంది నాకు. మీ పోస్టులో విషెస్ కంటే కన్వర్షన్‌కి సపోర్టింగ్‌గా ఉంది. ఒక హిందువుగా మీ పోస్టు పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను’ అని మాధవీలత అన్నారు. తాను పవన్ కళ్యాణ్ అభిమాని అని చెప్పుకునే మాధవీలత.. ఇప్పుడిలా ఆయననే టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేయడం, విమర్శించడం హాట్ టాపిక్ గా మారింది.

ట్రెండింగ్ వార్తలు