RRR Movie : మళ్లీ వాయిదా?

పాన్ ఇండియా సినిమాలకు ఒమిక్రాన్ టెన్షన్.. ‘ఆర్ఆర్ఆర్’ మళ్లీ వాయిదా పడనుందా?..

RRR Movie : మళ్లీ వాయిదా?

Rrr Movie Posteponde

Updated On : December 25, 2021 / 12:52 PM IST

RRR Movie: కరోనా దెబ్బకు కొన్నాళ్లు చాలా ఇబ్బందులు పడ్డ సినిమా పరిశ్రమ ఇప్పుడు సినిమా కష్టాలను ఎదుర్కొంటోంది. ఓవైపు థియేటర్ల మూత మరోవైపు ఒమిక్రాన్ దెబ్బతో దిక్కుతోచని పరిస్థితిలో పడింది ఫిలిం ఇండస్ట్రీ. ఈ నేపథ్యంలో రిలీజ్‌కి రెడీగా ఉన్న పాన్ ఇండియా సినిమాలపై గట్టి ఎఫెక్ట్ పడనుందని వార్తలు వినిపిస్తున్నాయి.

Guduputani : రివ్యూ

ఇప్పటికే మహారాష్ట్రలో థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ ప్రకటించడంతో నిర్మాతల్లో టెన్షన్ స్టార్ట్ అయ్యింది. నార్త్‌లో యూపీ, మహారాష్ట్రలో నైట్ కర్ఫ్యూ విధించారు. దీంతో రెండు షో లు రద్దవుతాయి. ఈ నేపథ్యంలో మిగతా ప్రాంతాల్లోని థియేటర్లలో కూడా 50 శాతం ఆక్యుపెన్సీ ప్రకటిస్తే పరిస్థితి వేరేలా ఉంటుంది.

RRR Movie : కపిల్ శర్మ షో లో ‘ఆర్ఆర్ఆర్’ టీం!

జనవరి 7న ‘ఆర్ఆర్ఆర్’, 14న ‘రాధేశ్యామ్’ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకు రెడీ అవుతున్నాయి. ఎట్టి పరిస్థితిలోనూ జనవరి 7నే తమ సినిమా విడుదలవుతుందంటూ ప్రమోషన్స్ స్పీడప్ చేసింది ‘ఆర్ఆర్ఆర్’ టీం. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రెండు పాన్ ఇండియా సినిమాలకు ఒమిక్రాన్ టెన్షన్ పట్టుకుంది. ఓవరీస్ మార్కెట్‌పైనా ఈ ఒమిక్రాన్ ఎఫెక్ట్ పడనుంది. దీంతో ‘ఆర్ఆర్ఆర్’ మరోసారి వాయిదా పడనుందని వార్తలు వస్తున్నాయి.