V-EPIQ Cinema Closed : ఏపీలో టికెట్ రేట్ల ఎఫెక్ట్.. బాహుబలి థియేటర్ మూసివేత

సినిమా టికెట్ల ధరలు తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వ తీసుకున్న నిర్ణయం వివాదానికి దారి తీసింది. దీని ఎఫెక్ట్ థియేటర్లపై పడుతోంది. ఏపీలో సినిమా థియేటర్లు వరుసగా మూతపడుతున్నాయి.

V-EPIQ Cinema Closed : ఏపీలో టికెట్ రేట్ల ఎఫెక్ట్.. బాహుబలి థియేటర్ మూసివేత

V Epiq Cinema Theatre

V-EPIQ Cinema Closed : సినిమా టికెట్ల ధరలు తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వ తీసుకున్న నిర్ణయం వివాదానికి దారి తీసింది. దీని ఎఫెక్ట్ థియేటర్లపై పడుతోంది. సినిమా థియేటర్లు మూతపడే పరిస్థితి వచ్చింది.

ఏపీలో సినిమా థియేటర్లు వరుసగా మూతపడుతున్నాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 35తో సినిమా టికెట్ల ధరలు భారీగా తగ్గించాల్సి వచ్చింది. దీంతో థియేటర్ల నిర్వహణ భారంగా మారిందని, ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయంటూ థియేటర్ యాజమానులు వాపోతున్నారు. మరోదారి లేక థియేటర్లను స్వచ్చందంగా మూసివేస్తున్నారు.

Vijay Deverakonda : తెలంగాణ సర్కార్ ఇండస్ట్రీ బాగును కోరుకుంటోంది..

తాజాగా ఏపీలో బాహుబలి థియేటర్ మూతపడింది. నెల్లూరు జిల్లా సుళ్లూరుపేటలోని V-EPIQ మల్టీప్లెక్స్ థియేటర్ క్లోజ్ అయ్యింది. నూతన టికెట్ విధానానికి నిరసనగా మల్టీప్లెక్స్ కు నిర్వాహకులు తాళం వేశారు. ఇది గ్రామ పంచాయతీలో ఉండటంతో టికెట్ల రేట్లు చాలా తక్కువగా ఉన్నాయని, తగ్గిన టికెట్ ధరలతో థియేటర్లను నడపలేము అంటూ సినిమా హాల్ కి మూతేసింది యాజమాన్యం. దేశంలోనే అతిపెద్ద స్క్రీన్ గా V-EPIQ మల్టీ ప్లెక్స్ కి పేరుంది. బాహుబలి థియేటర్ గానూ దీన్ని పిలుస్తారు. ప్రస్తుతం ఇందులో నాని హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్ మూవీ ఆడుతోంది. అయితే టికెట్ రేట్లు భారీగా తగ్గడంతో చేసేదేమీ లేక థియేటర్ ను మూసేసింది యాజమాన్యం. మల్టీప్లెక్స్ మూతపడటంతో సినీ ప్రేక్షకులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. సూళ్లూరు పేట జాతీయ రహదారిపై వీ-ఎపిక్‌ థియేటర్‌ ఉంది. దీన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది.

ప్రస్తుతం ఉన్న సినిమా టికెట్‌ ధరలతో థియేటర్లు నడపలేమని వాటి యజమానులు వాపోతున్నారు. స్వచ్ఛందంగా థియేటర్లకు తాళాలు వేస్తున్నారు. తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు సినిమా హాళ్ల బయట బోర్డులు పెడుతున్నారు.

కాగా, వి-ఎపిక్ సినిమా.. ఆసియాలోనే అతిపెద్ద స్క్రీన్‌ కలిగిన థియేటర్‌. ఇందులో సినిమాని ఎంజాయ్‌ చేసేందుకు సినీ ప్రియులు ఎక్కువగా ఆసక్తి చూపుతారు. కాగా, జీవో నెం 35కి అనుగుణంగా థియేటర్లు నడపడం సాధ్యం కాదని.. అందువల్ల థియేటర్‌ని కొన్నిరోజులపాటు మూసివేస్తున్నామని శనివారం(డిసెంబర్ 25,2021) ఉదయం యాజమాన్యం తెలిపింది.

(100 అడుగుల వెడల్పు… 54 అడుగుల ఎత్తు… సుమారు 650 మంది సీటింగ్ కెపాసిటీ… ఇదీ ‘వి ఎపిక్’ ప్రత్యేకత. ఇండియాలో, ఆ మాటకు వస్తే సౌత్ ఆసియాలోనే బిగ్గెస్ట్ స్క్రీన్ ఇది. ప్రపంచంలో చూసుకుంటే… మూడో భారీ స్క్రీన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేటలో ఉంది. రూ. 40 కోట్లతో దీనిని నిర్మించారని సమాచారం. నెల్లూరు జిల్లా వాసులు మాత్రమే కాదు, చెన్నైకి దగ్గరలో ఉండటంతో అతి ఇటు ప్రయాణాలు చేసే ప్రజలు సైతం ఆ థియేటర్లో సినిమా చూడటానికి ఆసక్తి చూపిస్తారు. ‘సాహో’ సినిమాతో ఈ థియేటర్‌లో షోలు మొదలయ్యాయి. దీన్ని రామ్ చరణ్ ప్రారంభించారు.

కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి థియేటర్ నిర్మించినప్పటికీ… గ్రామ పంచాయతీలో ఈ థియేటర్ ఉంది. దాంతో ఏపీ ప్రభుత్వం చెప్పిన రేట్లకు టికెట్లు అమ్మాల్సిన పరిస్థితి. గ్రామ పంచాయతీ పరిధిలో టికెట్ ధరలను ప్రభుత్వం (మల్టీప్లెక్స్- ప్రీమియం రూ.80, డీలక్స్ రూ.50, ఎకానమీ రూ.30) ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రేట్లకు టికెట్లు అమ్మడం కంటే థియేటర్ మూసి వేయడం వల్ల వచ్చే నష్టాలు తక్కువని యాజమాన్యం భావించింది. దాంతో థియేటర్ ను తాత్కాలికకంగా మూసివేసింది.

RRR Movie : మళ్లీ వాయిదా?

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ల వ్యవహారం హాట్‌ టాపిక్‌ అయింది. ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్‌ ధరలను తగ్గిస్తే, తెలంగాణలో రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం తాజాగా అనుమతి ఇచ్చింది. ఏపీలో సినిమా టికెట్‌ ధరల తగ్గింపుపై విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. టికెట్‌ ధరల తగ్గింపును సవాల్‌ చేస్తూ ఏపీలో పలు థియేటర్ల యజమానులు హైకోర్టు ఆశ్రయించగా, జీవో నెం.35ను న్యాయస్థానం రద్దు చేసింది.

ఈ వ్యవహారం ఇంకా కోర్టు విచారణలో ఉంది. దీనిపై జనవరి 4న తుది తీర్పు వెలువడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏపీలో పలు థియేటర్లలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నిబంధనలను అతిక్రమించి వాటిని సీజ్‌ చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇంకొన్ని థియేటర్లను స్వచ్ఛందంగా మూసి వేస్తున్నారు. ఏపీలో ఇలా ఉంటే, సినిమా టికెట్‌ రేట్లు పెంచుకునేందుకు అవకాశం కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం విశేషం.