జగిత్యాల జిల్లా జాబితాపూర్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ మారు గంగారెడ్డి హత్యకు గురి కావడం పట్ల కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. హత్య కాంగ్రెస్ పార్టీ శ్రేణులను నైరాశ్యానికి గురి చేస్తోందని చెప్పారు. 4 నెలల నుంచి మానసికంగా అవమానాలకు గురవుతూ వచ్చామని చెప్పారు.
భౌతికంగా నిర్వీర్యం చేయాలని చూస్తే తట్టుకునేంత శక్తి తనకు లేదని జీవన్ రెడ్డి అన్నారు. ఏ పదవి లేకున్నా ఎన్జీవో ద్వారానైనా ప్రజానీకానికి ఉపయోగపడతానని తెలిపారు. ఆత్మస్థైర్యం చెప్పే స్థితిలో తాను లేనని చెప్పారు.
తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని, వేరే పార్టీలోకి వెళ్లే ఆలోచనలేదని జీవన్ రెడ్డి అన్నారు. రాజకీయాలు ప్రశ్నార్థకంగా కనబడుతున్నాయని, నిందితుడు పోలీస్ స్టేషన్‌లో రక్షణ పొందుతున్నాడని చెప్పారు. పోలీసులు అదుపులోకి తీసుకోలేదని, నిందితుడే లొంగిపోయాడని అన్నారు.
పార్టీ ఫిరాయింపులను చూస్తే తనకు ఆశ్చర్యమేస్తోందని జీవన్ రెడ్డి చెప్పారు. అనైతిక పార్టీఫిరాయింపుల వల్లే నేడు గంగారెడ్డి హత్యకు గురయ్యాడని అన్నారు. తాను మానసికంగా అవమానాలు భరిస్తున్నానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో తన స్థానం ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు.
ప్రియాంకా గాంధీ నామినేషన్ వేయనున్న వేళ రాహుల్ గాంధీ ఆసక్తికర ట్వీట్