JP Nadda: నాగర్‌కర్నూల్‌లో బీజేపీ నవ సంకల్ప సభ.. హాజరుకానున్న జేపీ నడ్డా.. షెడ్యూల్ ఇలా..

బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా తెలంగాణ పర్యటనకు రానున్నారు. మహాజన సంపర్క్ అభియాన్‌లో భాగంగా నాగర్‌కర్నూల్ జిల్లాలో నిర్వహించ తలపెట్టిన సభలో నడ్డా పాల్గొని ప్రసంగిస్తారు.

JP Nadda: నాగర్‌కర్నూల్‌లో బీజేపీ నవ సంకల్ప సభ.. హాజరుకానున్న జేపీ నడ్డా.. షెడ్యూల్ ఇలా..

JP Nadda

Updated On : June 25, 2023 / 10:31 AM IST

JP Nadda Telangana Tour: బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా (JP Nadda) ఆదివారం తెలంగాణ పర్యటనకు రానున్నారు. మహాజన సంపర్క్ అభియాన్‌ (Mahajana Sampark Abhiyan) లో భాగంగా నాగర్‌కర్నూల్ జిల్లా (Nagar Karnool District) లో తలపెట్టిన సభలో నడ్డా పాల్గొని ప్రసంగిస్తారు. మోదీ తొమ్మిదేళ్ల పాలన పూర్తయిన నేపథ్యంలో ఈ బహిరంగ సభకు నవ సంకల్ప సభగా బీజేపీ నేతలు నామకరణం చేశారు. నవ సంకల్ప సభకు నాగర్ కర్నూల్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణంను బీజేపీ నేతలు సిద్ధంచేశారు. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల నుంచి సభకు భారీ సంఖ్యలో ప్రజలను తరలించేలా ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. కొల్లాపూర్ చౌరస్తా నుంచి ఉయ్యాలవాడ వరకు, పట్టణంలోని ప్రధాన వీధుల్లో ప్రచార ప్లెక్సీలతో నిండిపోయాయి.

Minister Amit shah: అమిత్ షాతో మంత్రి కేటీఆర్ భేటీ రద్దు.. కారణమేమంటే?

సభకు జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతో పాటు రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, ఇతర ముఖ్యనేతలు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. జేపీ నడ్డాకు హెలిప్యాడ్ వద్ద ఘనస్వాగతం పలికేందుకు ముఖ్య నాయకులు సమాయత్తం అయ్యారు. సంపర్క్ సే అభియాన్‌లో భాగంగా ఇద్దరు ముఖ్య వ్యక్తులు ‘క్లాసికల్ డ్యాన్సర్ పద్మశ్రీ ఆనంద శంకర, ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు’లను వారివారి నివాసాలకు వెళ్లి నడ్డా కలుసుకుంటారు. అనంతరం నరేంద్ర మోదీ తొమ్మిదేళ్ల పాలనలో అభివృద్ధి గురించి వివరించి పుస్తకాలను అందజేస్తారు.

Minister Harish Rao : నడ్డాలు, పాండేలు యూపీనుంచి వచ్చి మాకు నీతులు చెప్పక్కర్లా తెలంగాణా నుంచి మీరే నేర్చుకుని వెళ్లండీ : మంత్రి హరీశ్ రావు

నడ్డా పర్యటన షెడ్యూల్ ఇలా..

బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. మధ్యాహ్నం 1.15 నుంచి 2.30 వరకు సంపర్క్ సే అభియాన్‌లో భాగంగా ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులను కలవనున్నారు. సాయంత్రం 3 గంటలకు నోవాటెల్ హోటల్ కు చేరుకుంటారు. సాయంత్రం 4 గంటల వరకు నోవాటెల్ హోటల్‌లోనే ఉంటారు. సాయంత్రం 4.15 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి నాగర్‌కర్నూల్ సభకు హెలికాప్టర్‌లో బయలుదేరి వెళ్తారు. సాయంత్రం 4.45 నిమిషాలకు నాగర్ కర్నూల్‌కు చేరుకుంటారు. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు నాగర్‌కర్నూల్ జడ్పీహెచ్ఎస్ స్కూల్ గ్రౌండ్‌ సభలో జేపీ నడ్డా పాల్గొంటారు. సాయంత్రం 6.10 నిమిషాలకు నాగర్‌కర్నూల్ నుంచి బయలుదేరి వెళ్తారు. సాయంత్రం 6.40 నిమిషాలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు నడ్డా చేరుకుంటారు. సాయంత్రం 7.40 నిమిషాలకు ఎయిర్ పోర్టు నుండి తిరువనంతపురం బయలుదేరి వెళ్తారు.