×
Ad

Jubilee hills Bypoll : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ లైవ్ అప్డేట్స్.. ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి

Jubilee hills Bypoll: తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితం కాసేపట్లో తేలనుంది. ఉదయం 8గంటల నుంచి లెక్కింపు ప్రారంభమైంది.

Jubilee Hills Bypoll 2025

Jubilee hills Bypoll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నారు. మొదటి రౌండ్ నుంచి ప్రతీ రౌండ్ లో తన ఆధిక్యాన్ని నవీన్ యాదవ్ ప్రదర్శిస్తూ వస్తున్నారు.

ఏడవ రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 4030 ఓట్ల ఆధిక్యం సాధించారు.
ఏడు రౌండ్లు పూర్తయ్యే సరికి నవీన్ యాదవ్ ఆధిక్యం 19,600కు చేరింది.

పూర్తయిన ఐదవ రౌండ్ కౌంటింగ్.. ఐదో రౌండ్‌లో 3200కుపైగా మెజార్టీలో కాంగ్రెస్ అభ్యర్థి.
ఐదు రౌండ్లు ముగిసే సమయానికి 12, 500కుపైగా మెజార్టీలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్

రౌండ్ రౌండ్ కు పెరుగుతున్న కాంగ్రెస్ ఆధిక్యం..

మొదటి రౌండ్ – 47 ఓట్లు ఆధిక్యం

రెండవ రౌండ్ – 2995 ఓట్లు ఆధిక్యం

మూడవ రౌండ్ – 2843 ఓట్ల ఆధిక్యం

నాల్గవ రౌండ్ – 3547 ఓట్ల ఆధిక్యం

నాలుగో రౌండ్ ముగిసేవరకు కాంగ్రెస్ ఆధిక్యం – 9,432 ఓట్లు

మూడవ రౌండ్లో.. కాంగ్రెస్ అభ్యర్థికి 11082 ఓట్లు,
బీఆర్ఎస్ అభ్యర్థికి 8082 ఓట్లు
బీజెపి అభ్యర్థి 3475 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 3000 ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు.

మొదటి రౌండ్‌ ఫలితాలు..
మొదటి రౌండ్‌లో కాంగ్రెస్ పార్టీ 47ఓట్ల ఆధిక్యాన్ని సాధించింది.
కాంగ్రెస్ పార్టీకి 8,911 ఓట్లు
టీఆర్ఎస్ పార్టీకి 8,864 ఓట్లు,
బీజేపీకి 2,167 ఓట్లు వచ్చాయి.

పోస్టల్ బ్యాలెట్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యంలో ఉన్నారు. కాంగ్రెస్‌కు 47, బీఆర్ఎస్‌కు 43, బీజేపీకి 11 ఓట్లు వచ్చాయి.

Also Read: Naveen Yadav : దూసుకెళ్తున్న నవీన్ యాదవ్.. ఫస్ట్ టైం పోటీ చేసినప్పుడు ఎన్ని ఓట్లొచ్చాయో తెలుసా..? 15ఏళ్ల నిరీక్షణ తరువాత..

ఉదయం 8గంటల నుంచి లెక్కింపు ప్రారంభమైంది. యూసఫ్ గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇందుకోసం 42 టేబుల్స్ ఏర్పాటు చేశారు అధికారులు. ఈ ఉపఎన్నికలో 58మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. స్టేడియంలో ఒక వరుసకు 21టేబుళ్ల చొప్పున.. రెండు వరుసల్లో 42 టేబుళ్లను ఏర్పాటు చేశారు. మొత్తం 407 పోలింగ్‌ కేంద్రాల ఫలితాలు వెల్లడయ్యే వరకు 10 రౌండ్లలో ఓట్లను లెక్కిస్తారు.

రౌండ్, డివిజన్లు, పోలింగ్ బూత్ నెంబర్లు..
♦ షేక్‌పేట్ 1-422.
♦ షేక్‌పేట్, ఎర్రగడ్డ – 43-853.
♦ రహ్మత్ నగర్, వెంగళ రావునగర్ 86-128.
♦ వెళరావునగర్, రహ్మత్ నగర్ 129-171.
♦ రహ్మత్ నగర్, వెంగళరావునగర్ 172-214.
♦ వెంగళరావునగర్, యూసుఫ్‌గూడ 215-257.
♦ యూసుఫ్ గూడ, సోమాజిగూడ 258-300.
♦ సోమాజిగూడ , ఎర్రగడ్డ, బోరబండ 301-343.
♦ బోరబండ, ఎర్రగడ్డ 344-386.
♦ ఎర్రగడ్డ 387-407