Jubilee Hills Bypoll Results
Jubilee Hills Bypoll Results : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించారు. మొదటి రౌండ్ నుంచి ప్రతీ రౌండ్‌లోనూ తన ఆధిక్యాన్ని నవీన్ యాదవ్ ప్రదర్శిస్తూ వచ్చారు. దీంతో భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్ రికార్డును నవీన్ యాదవ్ బద్దలు కొట్టారు.
2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించిన మాగంటి గోపీనాథ్ మెజారిటీని నవీన్ యాదవ్ అధిగమించాడు. మాగంటి గోపినాథ్ కు 2023 అసెంబ్లీ ఎన్నిలక్లో 16,337 మెజారిటీ వచ్చింది. అయితే, ప్రస్తుతం నవీన్ యాదవ్ మాగంటి గోపీనాథ్ రికార్డును బద్దలు కొట్టాడు.
2014 ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ కు 9,242 మెజార్టీ వచ్చింది.
2018 ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ కు 16,004 ఓట్ల మెజార్టీ వచ్చింది.
2023 ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ కు 16,337 ఓట్ల మెజార్టీ వచ్చింది.
ప్రస్తుతం జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గోపీనాథ్ సాధించిన అత్యధిక మెజార్టీని బ్రేక్ చేశాడు. మొత్తం పది రౌండ్లలో తొమ్మిది రౌండ్లు పూర్తయ్యే సరికి 23,612 ఓట్ల మెజార్టీని నవీన్ యాదవ్ సాధించారు. దీంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మెజార్టీలో నవీన్ యాదవ్ సరికొత్త రికార్డును నమోదు చేశాడు.