JubileeHills Gang Rape Case : జూబ్లీహిల్స్ బాలిక గ్యాంగ్ రేప్ కేసు.. మిగతా ఇద్దరూ అరెస్ట్

సంచలనం రేపిన జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో మొత్తం ఐదుగురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు.

JubileeHills Gang Rape Case : సంచలనం రేపిన జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసు దర్యాఫ్తులో పోలీసులు మరింత పురోగతి సాధించారు. పరారీలో ఉన్న ఇద్దరు నిందితులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా అరెస్ట్ అయిన వారిలో ఒకరు మేజర్ కాగొ మరొకరు మైనర్. దీంతో ఈ కేసులో ప్రమేయం ఉన్న మొత్తం ఐదుగురు నిందితులు పోలీసుల అరెస్ట్ చేసినట్లు అయ్యింది.

ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి రిమాండ్ కు పంపారు. అరెస్ట్ అయిన వారిలో ఒకరు మేజర్ మరో ఇద్దరు మైనర్లు ఉన్నారు. మేజర్ ను చంచల్ గూడ జైలుకి తరలించగా, ఇద్దరు మైనర్లను జువైనల్ హోమ్ కు తరలించారు.

Jubilee Hills Rape Case: ఫేర్‌వెల్ పార్టీ కోసమే పబ్‌కు.. రెండు లక్షల రూపాయల ఖర్చు

ఈ కేసులో ఏ-2 సాదుద్దీన్ మాలిక్ ను పోలీసులు చంచల్ గూడ జైలుకి తరలించారు. మరోవైపు ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారిన అమ్నేషియా పబ్ ను పోలీసులు క్లోజ్ చేయించారు. మైనర్ బాలికపై అత్యాచార ఘటనకు నిరసనగా ప్రజా సంఘాలు జూబ్లీహిల్స్ లోని పబ్ ముందు ఆందోళనకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. ఇందులో భాగంగా అమ్నేసియా పబ్ ను మూసేయించారు. పబ్ ముందు భారీగా పోలీసు బలగాలను కూడా మోహరించారు.(JubileeHills Gang Rape Case)

బాలిక గ్యాంగ్ రేప్ కేసులో నిందితులు ఉపయోగించిన ఇన్నోవా కారుని కూడా పోలీసులు సీజ్ చేశారు. ఈ ఇన్నోవా కారులోనే నిందితులు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఇన్నోవా కారును మొయినాబాద్ ప్రాంతంలో పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఇన్నోవా కారు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఉంది.

Hyderabad Gang Rape : గ్యాంగ్ రేప్ ఘటనపై సీబీఐతో గానీ..లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి : రఘునందన్ రావు

మైనర్ బాలిక పై గ్యాంగ్ రేప్ కేసులో పోలీసుల విచారణలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి. మే 28న అమ్నేషియా పబ్ లో ఓ కార్పొరేట్ విద్యాసంస్థకు చెందిన ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు ఫేర్ వెల్ పార్టీ జరిగింది. విద్యాసంస్థ లెటర్ హెడ్ తో అమ్నేషియా పబ్ లో పార్టీ కోసం ఆసిఫ్ అనే వ్యక్తి అనుమతి తీసుకున్నాడు. నిషాంత్, ఆదిత్య, ఆసిఫ్ పార్టీ కోసం బుక్ చేశారు. ఈ పార్టీ కోసం పబ్ కు రూ.2లక్షలు కూడా చెల్లించినట్లు విచారణలో తేలింది. అయితే, పబ్ లో 150 మంది విద్యార్థులు వితౌట్ ఆల్కహాల్, నాన్ స్మోకింగ్ పార్టీ చేసుకున్నట్లుగా సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు గుర్తించారు.

ka paul: జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలి: కేఏ పాల్

గ్యాంగ్ రేప్ ఘటనలో టీఆర్ఎస్, ఎంఐఎం నేతల పిల్లలు ఉన్నారనే విషయం రాజకీయ పరంగా ప్రకంపనలు పుట్టిస్తోంది. ఈ వ్యవహారంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని విపక్షాలు మండిపడుతున్నాయి. ఆధారాలే లభించలేదని పోలీసులు చెపుతున్న క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కొన్ని ఆధారాలను మీడియా ముందు బయటపెట్టారు. అమ్నేషియా పబ్ వద్ద బెంజ్ కారులో ఉన్న ఎమ్మెల్యే కొడుకు, కారులో సదరు అమ్మాయితో అసభ్యంగా వ్యవహరిస్తున్న ఫొటోలను ఆయన విడుదల చేశారు.

పోలీసుల బెదిరింపులకు భయపడే వాళ్లు ఎవరూ లేరని ఎమ్మెల్యే రఘునందన్ అన్నారు. మమ్మల్ని భయపెట్టడం మానేసి, తప్పులు చేసిన వారిని భయపెట్టండని హితవు పలికారు. ఆధారాలు లేకుండా మాట్లాడితే కేసులు పెడతామని పోలీసులు అన్నారని… అందుకే ఈ ఆధారాలన్నీ చూపిస్తున్నానని చెప్పారు.

అత్యాచారానికి పాల్పడిన నిందితులను పోలీసులు ఎందుకు సీక్రెట్ గా దాస్తున్నారని ఎమ్మెల్యే రఘునందన్ ప్రశ్నించారు. నిందితులను ఇప్పటికే దేశం దాటించారని ఆరోపించారు. నిందితులు మేజరా? లేక మైనరా? అనే విషయం అనవసరమని చెప్పారు. నిర్భయ కేసులో కూడా మైనర్ల పేర్లు బయటకు వచ్చాయని… ఇక్కడ మన పోలీసులు నిందితుల పేర్లను ఎందుకు దాస్తున్నారని ఆయన నిలదీశారు.

ట్రెండింగ్ వార్తలు