ka paul: జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలి: కేఏ పాల్

జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని, ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న అధికార పార్టీ నేతల వారసులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్.

ka paul: జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలి: కేఏ పాల్

Ka Paul

ka paul: జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని, ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న అధికార పార్టీ నేతల వారసులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్. పార్టీ కార్యాలయంలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. అత్యాచారానికి గురైన బాలిక తండ్రి రొమేనియా వాసి కావడంతో రొమేనియా ప్రభుత్వానికి ఆయన క్షమాపణ చెప్పారు.

Major: మేజర్ ఫస్ట్ డే కలెక్షన్స్.. తొలిరోజే సగం వసూలు!

‘‘బాలికపై అత్యాచార ఘటనలో నిందితులు ఏ పార్టీ వాళ్లైనా కఠినంగా శిక్షించాలి. అమ్నేషియా పబ్ లైసెన్స్ రద్దు చేయాలి. ఘటన జరిగి ఏడు రోజులవుతున్నా నిందితుల ఫొటోలు ఎందుకు విడుదల చేయలేదు. డ్రగ్స్ వల్ల క్రైమ్ పెరుగుతుంది. హైదరాబాద్ నగరం క్రైమ్, డ్రగ్స్, రేపిస్టులకు అడ్డాగా మారింది. నిందితులకు పోలీసులు ఎలా మద్దతిస్తారు? ప్రధాన పత్రికల్లో కేసీఆర్ వందల కోట్లు ఖర్చుపెట్టి ప్రకటనలు ఇస్తున్నారు. తెలంగాణ కోసం బలిదానం చేసిన శ్రీకాంతాచారితోపాటు అమరులైన పన్నెండు వందల మంది ఫొటోలు ఎందుకు వెయ్యలేదు? తెలంగాణ కోసం కేసీఆర్ కుటుంబం బలిదానం చేశారా? శ్రీకాంతాచారి తండ్రి వెంకటాచారికి ఏం జరిగినా కేసీఆర్, కేటీఆర్‌లదే బాధ్యత. వెంకటాచారిని ఎమ్మెల్యేగా గెలిపిస్తాము. ఆయనపై దాడి చెయ్యడానికి చాలా మంది చూస్తున్నారు. మళ్లీ కేసీఆర్ సీఎం కాలేరు.

Janasena: కోనసీమలో చిచ్చుపెట్టింది ప్రభుత్వమే: నాదెండ్ల మనోహర్

వారి కుటుంబంలో ఎవ్వరూ గెలవరు. మేం పార్టీ పెట్టింది రైతుల కోసం. అవినీతి నిర్మూలన చెయ్యడానికి. మూడు ప్రధాన పార్టీల నాయకులు రోజూ తిట్టుకుంటున్నారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా మేం తప్పకుండా గెలుస్తాం. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ఒక్క సీటు కూడా రాదు. ఎమ్ఐఎమ్ పార్టీకి ఐదు సీట్లు వస్తాయి. మూడు పార్టీల నుంచి కూడా మా పార్టీలో చేరుతామని చూస్తున్నారు. చంద్రబాబు ఏపీని, కేసీఆర్ తెలంగాణను నాశనం చేశారు’’ అని కేఏ పాల్ వ్యాఖ్యానించారు.