Major: మేజర్ ఫస్ట్ డే కలెక్షన్స్.. తొలిరోజే సగం వసూలు!

టాలీవుడ్‌లో తెరకెక్కిన క్రేజీ ప్రాజెక్టుల్లో ‘మేజర్’ చిత్రం కూడా ఒకటి. ఈ సినిమాలో యంగ్ హీరో అడివి శేష్ నటిస్తుండగా, వీరజవాన్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితకథ ఆధారంగా ఈ సినిమా.....

Major: మేజర్ ఫస్ట్ డే కలెక్షన్స్.. తొలిరోజే సగం వసూలు!

Major First Day Worldwide Collections

Major: టాలీవుడ్‌లో తెరకెక్కిన క్రేజీ ప్రాజెక్టుల్లో ‘మేజర్’ చిత్రం కూడా ఒకటి. ఈ సినిమాలో యంగ్ హీరో అడివి శేష్ నటిస్తుండగా, వీరజవాన్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితకథ ఆధారంగా ఈ సినిమా కథను తెరకెక్కించారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాను దర్శకుడు శశికిరణ్ తిక్కా తెరకకెక్కించిన విధానం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ థియేటర్లకు పరుగులు పెట్టారు. దానికి తగ్గట్టుగానే ఈ సినిమా ప్రమోషన్స్‌ను చిత్ర యూనిట్ భారీ స్థాయిలో నిర్వహించింది. ఇక ఈ సినిమాను నిన్న(జూన్ 3) ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడంతో ఈ సినిమాకు అన్ని చోట్లలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడం విశేషం.

Major: మేజర్ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే..?

అయితే ఈ సినిమాలో అడివి శేష్ పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు. మేజర్ సందీప్ తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ముష్కరులను ఎలా మట్టుబెట్టాడనే అంశాన్ని చాలా చక్కగా చూపించారు. దీంతో ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. ఇక ఈ సినిమాను చూసేందుకు జనం థియేటర్లకు మంచి సంఖ్యలో వస్తుండటంతో కలెక్షన్స్ కూడా ఆటోమేటిక్‌గా పెరుగుతూ వచ్చాయి. ఈ సినిమా రిలీజ్ రోజునే ఎవరూ ఊహించని విధంగా కలెక్షన్స్ రాబట్టి అందరితో ఔరా అనిపించింది.

Major: మేజర్ టార్గెట్ ఎంతో తెలుసా?

పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయినా కూడా ఈ సినిమాకు తొలిరోజు కళ్లు చెదిరే రెస్పాన్స్ దక్కడంతో వసూళ్ల పరంగా కూడా అదరగొట్టింది ఈ మూవీ. మేజర్ చిత్రానికి యావత్ భారతదేశం దాసోహం అంది. దీంతో ఈ సినిమా తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.7.12 కోట్ల షేర్ వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాకు జరిగిన ప్రీరిలీజ్ బిజినెస్ చూసుకుంటే, తొలిరోజే సగం వసూళ్లను రాబట్టి ఈ సినిమా ఔరా అనిపించింది. ఇక ఈ వీకెండ్‌లోనూ మేజర్ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ రావడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది. ఏరియాల వారీగా ఈ సినిమా తొలిరోజు కలెక్షన్స్ ప్రపంచవ్యాప్తంగా ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 1.75 కోట్లు
సీడెడ్ – 46 లక్షలు
ఉత్తరాంధ్ర – 51 లక్షలు
ఈస్ట్ – 34 లక్షలు
వెస్ట్ – 24 లక్షలు
గుంటూరు – 30 లక్షలు
కృష్ణా – 28 లక్షలు
నెల్లూరు – 19 లక్షలు
టోటల్ ఏపీ+తెలంగాణ – రూ.4.07 కోట్లు(రూ.6.85 కోట్ల గ్రాస్)
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా – 0.35 కోట్లు
హిందీ – 0.35 కోట్లు
ఓవర్సీస్ – 2.35 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ – రూ.7.12 కోట్లు (రూ.13.10 కోట్ల గ్రాస్)