Jubilee Hills Rape Case: ఫేర్‌వెల్ పార్టీ కోసమే పబ్‌కు.. రెండు లక్షల రూపాయల ఖర్చు
జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై అత్యాచార ఘటనలో కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు. అమ్నేషియా పబ్‌లో హైదరాబాద్‌కు చెందిన ఒక కార్పొరేట్ విద్యా సంస్థకు చెందిన 12వ తరగతి విద్యార్థులు ఫేర్‌వెల్ పార్టీ నిర్వహించుకున్నారు.

Jubilee Hills Gang Rape
Jubilee Hills Rape Case: జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై అత్యాచార ఘటనలో కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు. అమ్నేషియా పబ్‌లో హైదరాబాద్‌కు చెందిన ఒక కార్పొరేట్ విద్యా సంస్థకు చెందిన 12వ తరగతి విద్యార్థులు ఫేర్‌వెల్ పార్టీ నిర్వహించుకున్నారు. దీని కోసం అసిఫ్ అనే విద్యార్థి కార్పొరేట్ విద్యా సంస్థ నుంచి లెటర్ హెడ్ కూడా తీసుకొచ్చి, పార్టీకి అనుమతి తీసుకున్నారు. మే 28న మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు 150 మంది విద్యార్థులు పబ్‌లో పార్టీ చేసుకున్నారు.
Janasena Nagababu : పవన్ నిప్పుల్లో దూకమంటే దూకాలి, 2024లో సీఎంగా చూసుకోవచ్చు-నాగబాబు
నాన్ ఆల్కహాల్, నాన్ స్మోకింగ్ జోన్‌లో ఈ పార్టీ జరిగింది. నిషాన్, ఆదిత్య, ఇషాన్, అసిఫ్ ఈ పార్టీకి పబ్ బుక్ చేశారు. దీని కోసం దాదాపు రెండు లక్షల రూపాయలు చెల్లించారు. పార్టీకి సంబంధించిన సీసీ టీవీ దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.