Jupalli Krishna Rao : 20న కొల్లాపూర్‌లో ‘పాలమూరు ప్రజాభేరి సభ’.. కాంగ్రెస్‌కు రాష్ట్ర ప్రజలు అధికారాన్ని బహుమతిగా ఇవ్వాలి

రాష్ట్రంలో అవినీతి పరిపాలన పోవాలంటే వచ్చేఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రజలు అధికారాన్ని బహుమతిగా ఇవ్వాలని జూపల్లి కృష్ణారావు కోరారు.

Jupalli Krishna Rao

Congress Leader Jupalli: ఈనెల 20న కొల్లాపూర్ నియోజకవర్గంలో పాలమూరు ప్రజాభేరి సభ ఉంటుందని జూపల్లి కృష్ణారావు అన్నారు. కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటన చేసిన  తరువాత జూపల్లి కృష్ణారావు భారీ కాన్వాయ్‌తో నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంకు వచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, జూపల్లి వర్గీయులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి జూపల్లి, కూచుకుళ్ల రాజేష్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

MLA Tatikonda Rajaiah : కాంగ్రెస్‌తో కడియం శ్రీహరి టచ్‌లో ఉన్నారు.. : ఎమ్మెల్యే రాజయ్య

ఈనెల 20న కొల్లాపూర్‌ నియోజకవర్గంలో పాలమూరు ప్రజాభేరి సభ జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో తొమ్మిదేళ్లుగా అవినీతి, రాక్షస పాలన నడుస్తుందని కేసీఆర్ ప్రభుత్వంపై జూపల్లి విమర్శలు గుప్పించారు. లక్షలాది తెలంగాణ యువకుల బతుకులు ఆగమయ్యాయని, నిరుద్యోగుల్లా మిగిలిపోయారని అన్నారు. తెలంగాణ ప్రజానీకాన్ని బీఆర్ఎస్ పార్టీ పాలిచ్చే నైతిక అర్హత కోల్పోయిందని, ఒక్కక్షణం కూడా అధికారంలో ఉండే అర్హత కేసీఆర్ ప్రభుత్వంకు లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకపోతే వీళ్ళ బతుకులు ఎక్కడ..? అంటూ కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశిస్తూ జూపల్లి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

రాష్ట్రంలో అవినీతి పరిపాలన పోవాలంటే వచ్చేఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రజలు అధికారాన్ని బహుమతిగా ఇవ్వాలని జూపల్లి కృష్ణారావు కోరారు.