K.Kavitha hunger strike: దీక్ష విరమణ.. మహిళా రిజర్వేషన్లను సమర్థిస్తూ పలువురు సంతకాలు చేశారన్న కవిత

చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల కోసం తాను చేసిన దీక్షకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెబుతున్నానని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తన దీక్ష ముగిశాక మాట్లాడారు. మహిళా రిజర్వేషన్లను సమర్థిస్తూ పలువురు సంతకాలు చేశారని చెప్పారు. సంతకాలు చేసిన లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి పంపుతామని చెప్పారు.

K.Kavitha hunger strike: చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల కోసం తాను చేసిన దీక్షకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెబుతున్నానని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తన దీక్ష ముగిశాక మాట్లాడారు. మహిళా రిజర్వేషన్లను సమర్థిస్తూ పలువురు సంతకాలు చేశారని చెప్పారు. సంతకాలు చేసిన లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి పంపుతామని చెప్పారు.

భవిష్యత్తులోనూ మహిళా రిజర్వేషన్ల కోసం పోరాడతామని కవిత స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందు మరో రెండు పార్లమెంట్ సెషన్స్ మాత్రమే ఉన్నాయని, ఇప్పుడే మహిళా బిల్లును ఆమోదింపజేసుకోవలని చెప్పారు. ఇప్పుడే మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందుతుందని భావిస్తున్నానని అన్నారు.

కాగా, పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారత్ జాగృతి ఆధ్వర్యంలో దీక్ష చేశారు. ఈ దీక్షకు బీఆర్ఎస్ ఎంపీలు, తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర పార్టీల నేతలు, పలు సంఘాల వారు హాజరయ్యారు.

మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందే వరకు పోరాటం కొనసాగుతుందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. భారత జాగృతి సంస్థకు అండగా ఉంటామని, మూడు దశాబ్దాలుగా మహిళా రిజర్వేషన్లపై చర్చ జరగకపోవడం బాధాకరమని చెప్పారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో మహిళలు వెనుకబడ్డారని, బిల్లు రాజ్యసభలో ఆమోదం పొంది, లోక్‌సభలో పెండింగ్‌లో ఉండిపోయిందని వివరించారు. ఈ బిల్లుకు సీపీఎం పూర్తి మద్దతు ఇస్తుందని ప్రకటించారు.

Delhi Liquor scam: చిరునవ్వుతో కోర్టుకు సిసోడియా.. విచారణలో ఎమ్మెల్సీ కవిత గురించి చెప్పిన ఈడీ.. పూర్తి వివరాలు

ట్రెండింగ్ వార్తలు