Delhi Liquor scam: చిరునవ్వుతో కోర్టుకు సిసోడియా.. విచారణలో ఎమ్మెల్సీ కవిత గురించి చెప్పిన ఈడీ.. పూర్తి వివరాలు

విజయ్ నాయర్‌ను తెలంగాణ ఎమ్మెల్సీ కె.కవిత కలిశారని ఈడీ తరఫు న్యాయవాదులు తెలిపారు. సౌత్ గ్రూపులో ఉన్నవారికి 9 జోన్లు దక్కాయని, ఒక సిండికేట్ ఏర్పడిందని చెప్పారు. ఢిల్లీ సీఎం, డిప్యూటీ సీఎం తరఫున విజయ్ నాయర్ వ్యవహారం నడిపారని అన్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి కవిత, సిసోడియా మధ్య మంచి అవగాహన ఉందని వివరించారు. 12 శాతం డీలర్ కమిషన్ అనే క్లాజ్‌ను పాలసీలో ఏకపక్షంగా చేర్చారని చెప్పారు. మనీశ్ సిసోడియా పాత్ర ప్రత్యక్షంగా ఉందని తెలిపారు.

Delhi Liquor scam: చిరునవ్వుతో కోర్టుకు సిసోడియా.. విచారణలో ఎమ్మెల్సీ కవిత గురించి చెప్పిన ఈడీ.. పూర్తి వివరాలు

Delhi Liquor scam

Manish Sisodia-Delhi Liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కాం మనీలాండరింగ్ కేసులో ఏ1 నిందితుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను ఇవాళ ఈడీ అధికారులు కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టులోకి వెళ్తున్న సమయంలో మనీశ్ సిసోడియా చిరునవ్వులు చిందించడం గమనార్హం. మనీశ్ సిసోడియాను ఈడీ నిన్న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో అరెస్టుల సంఖ్య 12కు చేరింది. దీంతో సిసోడియా ఈడీ అరెస్ట్ రిమాండ్ అప్లికేషన్ పై ప్రత్యేక కోర్టు ఇవాళ విచారణ జరుపుతోంది.

సిసోడియా తరఫు న్యాయవాదులు, ఈడీ తరఫు న్యాయవాదులు తమ వాదనలను వినిపించారు. సిసోడియాపై ఉన్న అభియోగాలను ఈడీ తరఫు న్యాయవాదులు వినిపించారు. మద్యం హోల్‌సేల్ వ్యాపారాన్ని కొందరికి మాత్రమే దక్కేలా కుట్రపూరితంగా మద్యం పాలసీని అమలు చేశారని అన్నారు.

కొందరికి మాత్రమే లబ్ది జరిగేలా మద్యం పాలసీని తయారు చేశారని తెలిపారు. డీలర్ కమిషన్ 12 శాతంగా నిర్ణయించాలని ప్రజల నుంచి ఎలాంటి సూచనలు లేవని చెప్పారు. ఆ పాలసీ సిండికేట్ అవడానికి ఆస్కారం కల్గించిందని తెలిపారు. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశంలో ఎక్కడా దీని గురించి చర్చించలేదని అన్నారు. సమావేశం మినట్స్ ఎక్కడా రికార్డు చేయలేదని తెలిపారు.

ఈ మొత్తం కుట్రలో విజయ్ నాయర్, సౌత్ గ్రూపులో మరికొందరు కలిసి కోఆర్డినేట్ చేశారని ఈడీ తరఫు న్యాయవాదులు తెలిపారు. తద్వారా హోల్‌సేల్ వ్యాపారులకు అసాధారణ లాభాలు వచ్చేలా ప్లాన్ చేశారని వివరించారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి నగదు బదిలీ జరిగిందని తెలిపారు. సౌత్ గ్రూపులో కొందరికి లైసెన్సులు దక్కేలా విజయ్ నాయర్ వ్యవహరించారని అన్నారు.

విజయ్ నాయర్‌ను తెలంగాణ ఎమ్మెల్సీ కె.కవిత కలిశారని ఈడీ తరఫు న్యాయవాదులు తెలిపారు. సౌత్ గ్రూపులో ఉన్నవారికి 9 జోన్లు దక్కాయని, ఒక సిండికేట్ ఏర్పడిందని చెప్పారు. ఢిల్లీ సీఎం, డిప్యూటీ సీఎం తరఫున విజయ్ నాయర్ వ్యవహారం నడిపారని అన్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి కవిత, సిసోడియా మధ్య మంచి అవగాహన ఉందని వివరించారు. 12 శాతం డీలర్ కమిషన్ అనే క్లాజ్‌ను పాలసీలో ఏకపక్షంగా చేర్చారని చెప్పారు. మనీశ్ సిసోడియా పాత్ర ప్రత్యక్షంగా ఉందని తెలిపారు.

ఇడో-స్పిరిట్స్ సంస్థ ఎల్-1 లైసెన్స్ పొందేలా సిసోడియా వ్యవహరించారని అన్నారు. సంజయ్ సింగ్ (ఆప్ ఎంపీ) అరోరాకు ఫోన్ చేసి పార్టీ ఫండ్ గురించి మాట్లాడారని తెలిపారు. సంజయ్‌ సింగ్‌ ఫోన్‌ చేసి ఎన్నికల నిధులు డిపాజిట్‌ చేయాలని కోరినట్లు దినేశ్ అరోరా తన ప్రకటనలో తెలిపారని అన్నారు. అరోరా రెస్టారెంట్ కోర్ట్ యార్డ్‌ను సిసోడియా చాలాసార్లు సందర్శించారని ఈడీ అధికారులు తెలిపారు. సంజయ్‌ సింగ్‌ ఫోన్‌ చేసి ఎన్నికల నిధులు డిపాజిట్‌ చేయాలని కోరినట్లు దినేశ్ అరోరా తన వాంగ్మూలంలో పేర్కొన్నారని అన్నారు.

అరోరా రెస్టారెంట్ కోర్ట్ యార్డ్‌ను సిసోడియా చాలాసార్లు సందర్శించారని తెలిపారు. జెట్ స్పీడుతో ఇండోస్పిరిట్స్ దరఖాస్తు క్లియర్ అయిందని వివరించారు. మనీశ్ సిసోడియా 14 ఫోన్లు ఉపయోగించారని అన్నారు. కేవలం 2 మాత్రమే రికవర్ అయ్యాయని తెలిపారు. మనీశ్ సిసోడియా ఆదేశాల మేరకు విజయ్ నాయర్ పనిచేశారని చెప్పారు. ఈ విషయాన్ని మనోజ్ రాయ్ తన వాంగ్మూలంలో పేర్కొన్నారని తెలిపారు. సిసోడియా ఉపయోగించిన ఫోన్లు, సిమ్ కార్డులు అతని పేరు మీద లేవని తెలిపారు.

తద్వారా సాక్ష్యాధారాలు లేకుండా చేయాలనుకున్నారని చెప్పారు. సిసోడియా తరపు న్యాయవాది వాదిస్తూ పలు వివరాలు తెలిపారు. సిసోడియా, నాయర్ కు ఒక్క రూపాయి వచ్చినట్లు నకుడా ఆధారాలు లేవని అన్నారు. 12 శాతం కమిషన్ కి ఎల్జీ అభ్యంతరం చెప్పలేదని తెలిపారు. ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ తో పాలసీ ఆమోదింపబడిందని అన్నారు.

ఎటువంటి మనీ లాండరింగ్ జరగలేదని అన్నారు. పాలసీ రూపొందించడం మని లాండరింగ్ కిందికి రాదని సిసోడియా తరఫు న్యాయవాది అన్నారు. విజయ్ మదన్‌లాల్ కేసులో తీర్పును ఉదహరించారు సిసోడియా తరఫు న్యాయవాది. నేరపూరిత కుట్ర, మనీ లాండరింగ్ రెండూ వేర్వేరు అంశాలని తెలిపారు. నేరపూరిత కుట్ర జరిగిందని ఈడీ వాదిస్తోందని అన్నారు. మనీలాండరింగ్‌లో ఈడీ డబ్బును మాత్రమే గుర్తించాలని తెలిపారు.

ప్రభుత్వాలు పాలసీలు రూపొందిస్తాయని, ఇందుకోసం అనేక అంచెలు దాటాల్సి ఉంటుందని అన్నారు. ఒక ఫైల్ ప్రభుత్వం, అధికారులు, ఆర్థిక, న్యాయ శాఖల కార్యదర్శుల చేతులు మారుతుందని తెలిపారు. ఈ పాలసీని లెఫ్టినెంట్ గవర్నర్‌కు కూడా పంపించారని, 12 శాతం డీలర్ కమిషన్ గురించి ఆయన ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని తెలిపారు. పాలసీ రూపకల్పనను మనీ లాండరింగ్‌తో ముడిపెట్టలేరని తెలిపారు. మనీ లాండరింగ్ జరిగిందంటే అందుకు సంబంధించిన పత్రాలు చూపించాలని, ఈడీ ఆ మేరకు ఒక్క పత్రమైనా చూపగలదా? అని ప్రశ్నించారు.

కాగా, గత మూడు రోజుల పాటు తీహార్ జైలులోనే సిసోడియాను ఈడీ అధికారులు ప్రశ్నించారు. అందులో భాగంగా రూ.100 కోట్ల ముడుపుల వ్యవహారాలు, సౌత్ గ్రూప్ తో ఉన్న సంబంధాలు వంటి కీలక అంశాలపై సిసోడియాను ఈడీ ప్రశ్నించింది. మార్చి 6న వారం రోజుల సీబీఐ విచారణ తరువాత సిసోడియాకి రౌస్ అవెన్యూ కోర్టు మళ్లీ మార్చి 20 వరకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించిన విషయం తెలిసిందే.

BRS MLC Kavitha: ఢిల్లీలో ప్రారంభమైన ఎమ్మెల్సీ కవిత దీక్ష.. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం డిమాండ్.. live updates