KA Paul On President : ఏ పార్టీ అభ్యర్థి రాష్ట్రపతి అవుతారో చెప్పేసిన కేఏ పాల్.. లాజిక్ ఇదేనట

ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్.. రాష్ట్రపతి ఎన్నికలు, ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారు? అనే అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎవరు గెలుస్తారో జోస్యం చెప్పారు. దీని వెనుక లాజిక్ కూడా ఆయన రివీల్ చేశారు.

KA Paul On President : రాష్ట్రపతి ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఓవైపు బీజేపీ, మరోవైపు విపక్షాలు.. రాష్ట్రపతి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తమ అభ్యర్థినే గెలిపించుకోవాలని వ్యూహాలు రచిస్తున్నాయి. ఎత్తుకి పైఎత్తులు వేస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్.. రాష్ట్రపతి ఎన్నికలు, ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారు? అనే అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎవరు గెలుస్తారో జోస్యం చెప్పారు.

ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ నిత్యం మీడియా ముందుకు వస్తారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు అన్ని విషయాలు మాట్లాడతారు. అంతర్జాతీయ వ్యవహారాల నుంచి గ్రామ సచివాలయం వరకు అన్ని అంశాలను ఎత్తుకుంటారు. గురువారం మీడియా ముందుకొచ్చిన పాల్.. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాల అనైక్యతే బీజేపీ బలం అన్న వాదనను వినిపించారు.(KA Paul On President)

Presidential Elections: రాష్ట్రపతి ఎన్నిక.. మొదటి రోజు 11 నామినేషన్లు

”బీజేపీ అభ్యర్థే తదుపరి రాష్ట్రపతి అవుతారు. వారికి దాదాపు 48శాతం పర్సెంట్ ఓటు బ్యాంక్ ఉంది. ఏపీ నుంచి సీఎం జగన్, ఒడిశా నుంచి సీఎం నవీన్ పట్నాయక్ తో మాట్లాడాను. మమతా బెనర్జీకి కాకుండా నేను బీజేపీకే సపోర్ట్ చేస్తానని నవీన్ పట్నాయర్ చెప్పడం జరిగింది. ఎప్పుడైతే నవీన్ పట్నాయక్ సపోర్ట్ చేస్తారో.. జగన్ సపోర్ట్ చేసినా చేయకపోయినా.. బీజేపీ అభ్యర్థే నెక్ట్స్ ప్రెసిడెంట్” అవుతారు అని కేఏ పాల్ తేల్చి చెప్పారు.

ప్రతిపక్షాల లీడర్లు చాలామందితో నేను వ్యక్తిగతంగా కలవడం, మాట్లాడటం జరిగింది. వాళ్లలో యూనిటీ లేదు. దాదాపు 18 పార్టీలు ఉంటే.. అందులో ఒకరిని (శరద్ పవార్) ప్రపోజ్ చేస్తున్నది 8 పార్టీలు. అయితే పోటీలో ఉండేందుకు తనకు ఇష్టం లేదని శరద్ పవార్ చెప్పడం జరిగింది. అలాగే మరో సీనియర్ మోస్ట్ లీడర్ గులాంనబీ ఆజాద్ ని కాంగ్రెస్ పార్టీ తరుఫున ప్రపోజ్ చేశారు. ఆయన కూడా ఇంట్రస్ట్ చూపడం లేదు.

Presidential elections: ఏకగ్రీవానికి సహకరించండి.. మమతా బెనర్జీని కోరిన రాజ్‌నాథ్ సింగ్

విపక్షాల్లో ఉన్న మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే.. ఎవరికి వారే యమునా తీరే. ఏవీ లేని కేసీఆరే నేషనల్ ఫ్రంట్, ఆ ఫ్రంట్, ఈ ఫ్రంట్ అని సంవత్సరాల నుంచి వేల కోట్ల రూపాయలు వేస్ట్ చేస్తున్నారు. కేసీఆర్ ను కలిసిన తర్వాత ప్రశాంత్ కిషోర్ ని కూడా కలవడం మానేశారు. విపక్షాలన్నీ ఐక్యతగా లేకపోవడమే బీజేపీ బలం.

కేజ్రీవాల్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చా. నాలుగున్నర లక్షల కోట్లు ఆయన తెలంగాణను తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని నాశనం చేసి అప్పుల పాలు చేశారు. దాదాపు 9లక్షల 10వేల కోట్లు కనిపించడం లేదు. కరప్షన్ ఫ్రీ అంటారు. లాస్ట్ టైమ్ చంద్రబాబుని కలిశారు. అక్కడ 6 లక్షల కోట్ల కరప్షన్ జరిగిందని విన్నావ్. ఇప్పుడేమో కేసీఆర్ ని కలుస్తున్నావ్ అంటే.. లేదండి.. ఏదో డెవలప్ మెంట్ అజెండాతో అపొజిషన్ లీడర్ వస్తే కలిశాం.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

కేసీఆర్.. తెలంగాణలో తిరస్కరించబడ్డారు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆయన ఇచ్చిన 100 వాగ్దానాల్లో ఒక్కటీ నెరవేర్చలేదు. 10లక్షల రూపాయలు ఒక కుటుంబానికి అప్పు చేసి దళిత బంధు కింద ఏడాదికి కేవలం రూ.10వేలే ఇస్తున్నారు. అంటే మూడేళ్లకు కేవలం రూ.30వేలే ఇచ్చారు. అంటే.. ఒక్కో కుటుంబానికి రూ.10లక్షల అప్పు చేశారు. అంతేకాకుండా దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని అన్నారు, కానీ చెయ్యలేదు” అని కేఏ పాల్ విమర్శలు గుప్పించారు.

ట్రెండింగ్ వార్తలు