Bandi Sanjay Kumar (Photo Credit : Facebook)
కేంద్ర కేబినెట్‌లో బీజేపీ తెలంగాణ ఎంపీ బండి సంజయ్‌కి చోటు దక్కనుంది. బీజేపీలో ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. కార్పొరేటర్ నుంచి కేంద్ర మంత్రి వరకు బండి ప్రస్థానం ప్రశంసనీయం. బాల్యం నుంచే ఆర్ఎస్ఎస్‌లో ఆయన పనిచేశారు.
కరీంనగర్ నగర పాలక సంస్థ గా ఏర్పడిన తర్వాత తొలి 48వ డివిజన్ నుంచి బీజేపీ కార్పొరేటర్ గా గెలిచారు. 2014, 2019, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు. వాటిల్లో ఓడిపోయారు.
ఎంపీగా.. 2019, 2024 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు సార్లు విజయం సాధించారు. 2020లో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన నియమితుడయ్యారు. 2023లో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, 2024లో జాతీయ కిసాన్ మోర్చ ఇన్‌ఛార్జిగా ఆయనను బీజేపీ నియమించింది.
సంబరాలు
కేంద్ర కేబినెట్‌లో బీజేపీబండి సంజయ్‌కి చోటు దక్కడంతో కుటుంబ సభ్యుల సంబరాలు జరుపుకున్నారు. బండి సంజయ్ తల్లి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీజేపీ కోసం బండి సంజయ్ ఎంతో కృషి చేశారని, ఉన్నత స్థాయికి రావడం తమకు చాలా గర్వంగా ఉందని అన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ బండి సంజయ్ ఎన్నో సార్లు జైలుకు వెళ్లారని చెప్పారు.
Also Read: ఏపీలో వైఎస్సార్ విగ్రహాలపై దాడులు.. వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు