KCR On Karnataka BusAccident : కర్నాటక బస్సు ప్రమాదం.. సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

ఘోర రోడ్డు ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న హైదరాబాద్ వాసులు మరణించడం పట్ల కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. వారి మరణం పట్ల సంతాపం తెలిపారు.

KCR On Karnataka BusAccident : కర్నాటక రాష్ట్రంలోని కలబురిగిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న హైదరాబాద్ వాసులు మరణించడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. వారి మరణం పట్ల సంతాపం తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే సంబంధిత ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన సీఎం కేసీఆర్ తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కర్నాటక ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకున్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్.(KCR On Karnataka BusAccident)

Bus Accident: బస్సు ప్రమాద ఘటనలో మా సిబ్బంది తప్పిదం లేదు: ఆరెంజ్ ట్రావెల్స్

గోవా నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగి 8 మంది సజీవ దహనమయ్యారు. ఈ దారుణ ఘటన ఇవాళ తెల్లవారుజామున కర్ణాటకలోని కలబురిగిలో జరిగింది. చనిపోయిన వాళ్లంతా హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. అర్జున్ కుమార్ (37), అతడి భార్య (32), బివాన్ (4), దీక్షిత్ (9), అనితా రాజు (40), శివ కుమార్ (35), రవళి (30) సజీవ దహనమయ్యారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులున్నారు.

రెండు కుటుంబాలకు చెందిన 32 మంది ఆరెంజ్ ట్రావెల్స్ బస్సును మాట్లాడుకుని గోవా విహారయాత్రకు వెళ్లినట్టు సమాచారం. తిరుగు ప్రయాణంలో గోవా నుంచి హైదరాబాద్ కు వస్తుండగా కలబురిగి జిల్లా కమలాపురలో ఓ మినీలారీని ఢీకొట్టిన బస్సు.. కల్వర్టులో పడిపోయింది. క్షణాల్లోనే బస్సుకు మంటలంటుకుని తీవ్రరూపం దాల్చాయి.

ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్, సహాయకుడు సహా 35 మంది ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన కొందరు ప్రయాణికులు బయటకు దూకేశారు. గాయపడిన మరో 12 మందిని స్థానికులు కలబురిగి ఏరియా ఆసుపత్రికి తరలించారు.

karnataka bus accident : కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం- 8 మంది హైదరాబాదీలు మృతి

మంటల్లో బస్సు పూర్తిగా కాలిపోయింది. లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో బస్సు అదుపుతప్పి కల్వర్టు పైనుంచి బోల్తా పడింది. ప్రమాదం తర్వాత బస్సు డీజిల్‌ ట్యాంక్‌ ఒక్కసారిగా పేలింది. మంటల్లో చిక్కుకుని 8 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో బస్సు డ్రైవర్‌, క్లీనర్‌ ఉన్నారు. మరో డ్రైవర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఈ ప్రమాద ఘటనపై ఆరెంజ్ ట్రావెల్స్ ప్రతినిధులు స్పందించారు. ఈ ఘటనలో తమ సిబ్బంది తప్పేమీ లేదన్నారు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగిందని ఆరెంజ్ ట్రావెల్స్ సంస్థ మేనేజర్స్ చెప్పారు. ‘‘గత నెల 28న బస్సు హైదరాబాద్ నుంచి గోవాకు వెళ్లింది. 29న ఉదయం బస్సు గోవా చేరుకుంది. అర్జున్ కుమార్ అనే వ్యక్తి గోవాకు 26 టికెట్స్ బుక్ చేసుకున్నాడు. అర్జున్ కుమార్ కుటుంబంతోపాటు, మరో ఆరుగురు ఇతర ప్రయాణికులు గోవా వెళ్లారు.

అన్ని బుకింగ్స్‌కు అర్జున్ కుమార్ ఒకటే నెంబర్ ఇచ్చారు. ప్రయాణికులతో పాటు బస్సులో ఇద్దరు డ్రైవర్లు, ఒక క్లీనర్ ఉన్నారు. బస్సు ప్రమాదంలో అర్జున్ కుమార్ కూడా చనిపోయినట్లు తెలిసింది. మృతుల కుటుంబాలను సంస్థ తరఫున ఆదుకుంటాం. చనిపోయిన వారికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియలేదు. ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందిస్తున్నాం.

ఎన్నో ఏళ్లుగా మా ట్రావెల్స్ ద్వారా వేల మంది ప్రయాణికులను గమ్య స్థానానికి చేరుస్తున్నాం. ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదు. ఎనిమిది మంది చనిపోవడం దురదృష్టకరం. ఈ ఘటనలో మా సిబ్బంది తప్పిదం ఏమీ లేదు. బస్సుకు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి పల్టీ కొట్టి, ఫైర్ అయ్యింది. ఏసీ బస్సు కావడం.. ఇంధనం బాక్స్ పగిలిపోవడంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. మా బస్సుకు సంబంధించి ఆర్‌టీఏ నిబంధనలు కచ్చితంగా పాటిస్తున్నాం’’ అని ఆరెంజ్ ట్రావెల్స్ ప్రతినిధులు చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు