×
Ad

కల్వకుంట్ల కవిత భారీ యాత్రకు సిద్ధం.. కేసీఆర్ ఫొటో లేకుండానే.. భారీ ప్లాన్‌ రెడీ

వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు అన్ని జిల్లాలను కలుపుకుంటూ యాత్ర చేయనున్నారు.

Kalvakuntla Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ నెల చివరి వారంలో జిల్లాల యాత్ర ప్రారంభించనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు అన్ని జిల్లాలను కలుపుకుంటూ యాత్ర చేయనున్నారు.

రేపు తన యాత్రకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను విడుదల చేస్తారు. మాజీ సీఎం కేసీఆర్ ఫొటో లేకుండానే యాత్ర చేయాలని కవిత నిర్ణయం తీసుకున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ ఫొటోతో ప్రజల్లోకి వెళ్లాలని ఆమె భావిస్తున్నారు. ఇప్పటికే మేధావులు, వివిధ వర్గాలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.

బంగారం ధరలు ఆకాశాన్నంటనున్నాయా? ఈ ధనత్రయోదశికి మీ జేబుకు చిల్లు పడుతుందా? నిపుణుల సూచన ఇదే..

కాగా, గ్రూప్-1 పరీక్షను తిరిగి నిర్వహించాలంటూ, జాబ్ క్యాలెండ‌ర్‌ను ప్రకటించాలంటూ హైదరాబాద్‌లోని చిక్క‌డ‌ప‌ల్లి సెంట్రల్ లైబ్రరీ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులను ఇవాళ సాయంత్రం కవిత కలిశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సెంట్రల్ లైబ్రరీ ఆవరణలో బైఠాయించారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.