President Elections 2022 : నేటి మమతా బెనర్జీ సమావేశానికి టీఆర్ఎస్ దూరం

రాష్ట్రపతి పదవికి విపక్షాల తరున అఫుభ్యర్దిని ఎంపిక చేసేందుకు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ   ఈ రోజు  ఢిల్లీలో  ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరు కాకూడదని టీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. 

President Elections 2022 :  రాష్ట్రపతి పదవికి విపక్షాల తరున అఫుభ్యర్దిని ఎంపిక చేసేందుకు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ   ఈ రోజు  ఢిల్లీలో  ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరు కాకూడదని టీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది.  టీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్యనేతలు కానీ ప్రతినిధులు కానీ ఈ సమావేశానికి హాజరు కాబోరని పార్టీ వర్గాలు తెలిపాయి.

హైదరాబాద్ ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు అధ్యతన నిన్న  జరిగిన  ముఖ్య సమావేశంలో ఈ మేరకు  నిర్ణయం తీసుకున్నారు. కొంతమందిని అభ్యర్ధులుగా ప్రొజెక్ట్ చేయటం తప్ప ఇది సంప్రదింపుల సమావేశం కాదని వారు అభిప్రాయపడ్డారు. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో విపక్ష నేతలు కలిసి కూర్చొని.. ఎవరికీ ఇబ్బంది కలిగించని, అందరికీ ఆమోదయోగ్యమైన ఏకాభిప్రాయ అభ్యర్థిపై ముందుగా చర్చించి ఒక అంగీకారానికి వచ్చి.. ఆ తరువాత ఆ అభ్యర్థి ఆమోదం పొందేందుకు ప్రయత్నిస్తారని, కానీ ఇప్పుడు మాత్రం ముందే ఒక అభ్యర్థిని అనుకొని అతనితో సంప్రదింపులు కూడా ప్రారంభించి, ఆ తరువాత సమావేశం పెట్టడంలో ఆంతర్యం ఏమిటని టీఆర్‌ఎస్‌ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.

ప్రజాస్వామిక పద్ధతిలో జరిగే చర్చలకు, సంప్రదింపులకు, పట్టువిడుపులకు టీఆర్‌ఎస్‌ సానుకూలంగా స్పందిస్తుందని, అదే సమయంలో ఎవరి ఏకపక్ష ఆధిపత్య ధోరణిని కూడా అంగీకరించే ప్రసక్తే ఉండదని టీఆర్‌ఎస్‌ పార్టీ ఉన్నత స్థాయి వర్గాలు స్పష్టంచేశాయి. ఆవిర్భావం నాటి నుంచి కూడా టీఆర్‌ఎస్‌ పార్టీ విధానం ఇదేనని, ఒకరు నిర్ణయం తీసుకొని రుద్దుదామంటే సహించేది లేదని స్పష్టంచేశాయి. ఈ కారణాల వల్ల ఈ సమావేశంలో పాల్గొనడం లేదని అవి తేల్చి చెప్పాయి.

Also Read : Rahul Gandhi ED : నేషనల్ హెరాల్డ్ కేసు.. రాహుల్ గాంధీ తీరుపై ఈడీ అసంతృప్తి
రాష్ట్రపతి ఎన్నికకు ఓటింగ్‌ విషయంలో ఎలాంటి వైఖరి తీసుకోవాలనే దానిపై టీఆర్‌ఎస్‌ తరువాత ఆలోచించి తన నిర్ణయాన్ని ప్రకటిస్తుందని అవి వివరించాయి. మరోవైపు కాంగ్రెస్ బీజేపీలకు సమాన  దూరం పాటించాలనీ కూడా టీఆర్ఎస్ నిర్ణయించింది. కాంగ్రెస్ హజరయ్యే సమావేశంలో పాల్గోంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని టీఆర్ఎస్ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

 

ట్రెండింగ్ వార్తలు