కీసర మాజీ తహసీల్దార్…అవినీతికే రారాజు, లాకర్ తెరిస్తే..కిలోన్నర బంగారం, గోల్డ్‌ వాచ్‌, డైమండ్‌ నెక్లెసులు

  • Publish Date - September 3, 2020 / 07:12 AM IST

కీసర మాజీ తహసీల్దార్‌ నారాజు అవినీతికే రాజులా మారాడు. తాను చేసిన అక్రమాలపై ఏసీబీ కస్టడీలో అసలు నోరువిప్పని నాగరాజు… ఇప్పుడూ అదే పంథా అవలంభిస్తున్నాడు. తన బినామీలు, బ్యాంక్‌ లాకర్ల గురించిన సమాచారం అస్సలు చెప్పడం లేదు. ఏసీబీ మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా నాగరాజు అవినీతి సామ్రాజ్యాన్ని కుప్పకూలుస్తోంది. నాగరాజు బినామీ పేరుతో ఉన్న బ్యాంకు లాకర్‌ను ఓపెన్‌ చేయగా… భారీగా బంగారు నగలు బయటపడ్డాయి.



మేడ్చల్‌ జిల్లా కీసర మాజా తహసీల్దార్‌ నాగరాజు అవినీతి కేసులో ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే నాగరాజు నుంచి భారీగా నగదు స్వాధీనం చేసుకున్న ఏసీబీ… ఇప్పుడు ఆయన లాకర్లపై దృష్టి సారించింది. నాగరాజు, ఆయన భార్య తమకు ఎలాంటి బ్యాంకు లాకర్లు లేవని ఏసీబీ అధికారులను తప్పుదోవ పట్టించారు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా ఏసీబీ నాగరాజు బ్యాంక్‌ లాకర్‌ను ఓపెన్‌ చేయించింది.

అందులో 57.6 లక్షల విలువైన కిలోన్నర బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అల్వాల్లోని సౌత్‌ ఇండియన్‌ బ్యాంకులో లాకర్‌ ఉన్నట్టు గుర్తించి సోదాలు చేశారు. లాక్‌ తెరవడంతో కిలోన్నర బంగారం, వీటిలో చేతి గోల్డ్‌ వాచ్‌, డైమండ్‌ నెక్లెసులు స్వాధీనం చేసుకున్నారు.



బ్యాంకులో నాగరాజు బినామీ పేరుతో లాకర్‌ నిర్వహిస్తున్నాడు. దగ్గరి బంధువైన జిజే నరేందర్‌ పేరుతో లాకర్‌ ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. బ్యాంక్‌ మేనేజర్‌తోపాటు నరేందర్‌రెడ్డి స్టేట్‌మెంట్‌నూ రికార్డు చేశారు. స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలను ఏసీబీ కోర్టులో డిపాజిట్‌ చేశాడు. మరోవైపు నలుగురు నిందితులు ఇప్పటికే బెయిల్‌ పిటిషన్‌ కోసం న్యాయస్థానాన్ని కోరారు.
https://10tv.in/daughter-of-senior-railway-official-shoots-mother-teenage-brother/
అయితే బెయిల్‌ మంజూరు చేయవద్దంటూ ఏసీబీ కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై 2020, సెప్టెంబర్ 04వ తేదీ శుక్రవారం జరుగనుంది. నాగరాజు బినామీ జీజే నరేందర్‌ పేరుతో ఉన్న లాకర్‌ నుంచి బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకోవడంతో.. లాకర్‌పై సస్పెన్స్‌ వీడింది.