Doctor Kissed Corona Dead Body
doctor kissed corona dead body : కరోనా..కరోనా..కరోనా. ఎక్కడ విన్నా ఇదే మాట. కరోనాతో చనిపోతే..వారికూడా సోకుతుందనే భయంతో కుటుంబ సభ్యులు కూడా దగ్గరకు రావట్లేదు. కొంతమంది కనీసం దహన సంస్కారాలు కూడా చేయటంలేదు.కారణం..మృతదేహం నుంచి తమకు కూడా వైరస్ వ్యాపిస్తుందన్న భయం..కన్నవారైనా సరే..కట్టుకున్నవారైనా సరే..అదే భయం అదే పరిస్థితి. కానీ ఓ డాక్టర్ మాత్రం కరోనా మృతదేహానికి ముద్దు ఇచ్చాడు. ఈ ఘటన తెలంగాణాలోని ఖమ్మం జిల్లాలో జరిగింది.ఎందుకో తెలిస్తే హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..
రోనాతో చనిపోతే ఆ మృతదేహాల నుంచి వైరస్ సంక్రమిస్తుందా?..
అసలు కరోనాతో చనిపోతే ఆ మృతదేహాల నుంచి వైరస్ సంక్రమిస్తుందా? వైరస్ మృతులను ఖననం చేయాలా? దహనం చేయాలా? ఇలా ఎన్నో ప్రశ్నలు ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. కోవిడ్-19 మృతదేహాల విషయంలో అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మృతదేహాల నుంచి వైరస్ సోకుతుందనే భయం అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తోంది. కానీ ప్రజలకు ఈ భయాలు మాత్రం పోవటంలేదు. దీని ఎవ్వరూ దగ్గరకు రావటంలేదు. కోవిడ్-19 వ్యాధికి కారణమయ్యే సార్స్-కోవ్-2 వైరస్ ప్రధానంగా మనుషుల ఉమ్మి, తుమ్ము, దగ్గు తుంపర్ల ద్వారా ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుంది. అయినా కూడా జనం ఎవరూ కరోనా మృతదేహాలకు దరిదాపుల్లోకి రావడం లేదు.
ఇటువంటి అపోహలు తొలగించేందుకు..ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఓ డాక్టర్ ముందుకొచ్చారు. ప్రజల్లో అపోహలు తొలగించి, వారిలో స్థైర్యం నింపేందుకు ఖమ్మంలోని అన్నం ఫౌండేషన్ వ్వవస్థాపక చైర్మన్ డా.అన్నం శ్రీనివాసరావు కొవిడ్ మృతదేహాన్ని ముద్దాడారు. కరోనాతో చనిపోయారనగానే ఆప్తులే మృతదేహాన్ని వదిలేసి ఆమడ దూరం పారిపోతున్న సమయంలో.. కరోనాతో చనిపోయిన మృతదేహాల ద్వారా వైరస్ వ్యాప్తి చెందదని నిరూపించేందుకే డాక్టర్ అన్నం శ్రీనివాసరావు కరోనా మృతదేహాన్ని ముద్దు పెట్టుకుని చూపించారు.