తెలంగాణలో ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా 88 స్థానాల్లో గెలవాలని, ఆ లక్ష్యంతోనే బీజేపీ నేతలు పనిచేయాలని ఆ పార్టీ నేత కిషన్ రెడ్డి అన్నారు. త్వరలోనే నియోజకవర్గాల పునర్విభజన జరగనుందని, రాష్ట్ర బీజేపీ నేతలకు మంచి అవకాశాలు వస్తాయని తెలిపారు.
రాష్ట్రం నుంచి ఒక కేంద్రమంత్రి, ఒక సహాయ మంత్రి పదవులు ఇచ్చిన తమ పార్టీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. ఓ కార్యకర్తలుగా పనిచేసిన ముగ్గురిని మంత్రులుగా చేసిన ఘనత తమ పార్టీదేనని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలుచేస్తామని అన్నారు.
తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో బీజేపీ రూ.లక్షల కోట్ల అభివృద్ధి పనులు చేసిందని అన్నారు. వచ్చే ఐదేళ్లలో 3 కోట్ల ఇళ్లు నిర్మించి ప్రజలకు ఇవ్వబోతున్నామని చెప్పారు.
దక్షిణ భారత్‌లో పార్టీని పటిష్ఠం చేయడంపై కార్యకర్తలు దృష్టిపెట్టాలని అన్నారు. ప్రదాని, కేంద్ర మంత్రుల ప్రమాణ స్వీకారం వేల దేశమంతా సంబరాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
అమరావతి రాజధాని నిర్మాణానికి పనులు చేపట్టాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి: సీఎస్