అమరావతి రాజధాని నిర్మాణానికి పనులు చేపట్టాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి: సీఎస్

Nirab Kumar: రాజధాని నగరానికి భూములు ఇచ్చిన రైతుల సమస్యలు..

అమరావతి రాజధాని నిర్మాణానికి పనులు చేపట్టాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి: సీఎస్

Nirab Kumar

Updated On : June 9, 2024 / 6:31 PM IST

అమరావతి రాజధాని నిర్మాణానికి పనులు చేపట్టాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ అన్నారు. ఇవాళ 10 టీవీతో ఆయన మాట్లాడారు. ఉద్దండరాయిని పాలెం దగ్గర శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు.

పెండింగ్ లో ఉన్న పనులన్నీటిని పూర్తి చేయడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని నీరభ్ కుమార్ చెప్పారు. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుంచి పనులు ప్రారంభమవుతాయని అన్నారు. 25 ప్రాంతాల్లో అమరావతి రాజధాని నగరంలో ఉన్న 25 ప్రాంతాలను గుర్తించామని తెలిపారు.

ఆ ప్రాంతాలన్నిటినీ పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడానికి కార్యాచరణ రూపొందిస్తున్నామని నీరభ్ కుమార్ చెప్పారు. రాజధాని నగరానికి భూములు ఇచ్చిన రైతుల సమస్యలు అన్నిటిని కూడా పరిష్కరిస్తామని తెలిపారు.

దటీజ్ బండి సంజయ్.. కార్పొరేటర్ నుంచి కేంద్ర మంత్రి వరకు ఆయన ప్రస్థానం.. పూర్తి వివరాలు