Rajagopal reddy- Kavitha : ‘నిజం నిప్పులాంటిది చెల్లెమ్మా’నువ్వు జైలుకెళ్లకుండా మీ అన్నే కాదు మీ నాయన కూడా కాపాడలేరు
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత..బీజేపీ నేతల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య ట్వీట్ల వార్ నడుస్తోంది. అన్నా రాజగోపాల్ ‘అన్నా తొందరపడకు నోరు జారకు’ అంటూ కవిత చేసిన ట్వీట్ కు కౌంటర్ గా రాజగోపాల్ రెడ్డి ‘చెల్లెమ్మా నిజం నిప్పులాంటిదమ్మా ’అంటూ రీ కౌంటర్ ఇచ్చారు. అన్నా అంటూనే రాజగోపాల్ పై సెటైర్లు వేసిన కవితకు అంతకంటే స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ..‘ నిజం నిప్పులాంటిది చెల్లెమ్మ. నువ్వు లిక్కర్ స్కాం లో ఉన్నది నిజం, జైలుకి వెళ్లడం ఖాయం. నిన్ను మీ అన్న మీ నాయనా ఎవ్వరు కాపాడలేరు అంటూ సమాధానమిచ్చారు.

Komati reddy Rajagopal reddy- TRS MLC Kavitha Twitter War
Komati reddy Rajagopal reddy- TRS MLC Kavitha Twitter War: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత..బీజేపీ నేతల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య ట్వాట్ల వార్ నడుస్తోంది. అన్నా రాజగోపాల్ అన్నా తొందరపడకు నోరు జారకు అంటూ కవిత చేసిన ట్వీట్ కు కౌంటర్ గా రాజగోపాల్ రెడ్డి రీ కౌంటర్ ఇచ్చారు. అన్నా అంటూనే రాజగోపాల్ పై సెటైర్లు వేసిన కవితకు అంతకంటే స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ..‘ నిజం నిప్పులాంటిది చెల్లెమ్మ. నువ్వు లిక్కర్ స్కాం లో ఉన్నది నిజం, జైలుకి వెళ్లడం ఖాయం. నిన్ను మీ అన్న మీ నాయనా ఎవ్వరు కాపాడలేరు అంటూ సమాధానమిచ్చారు.
మునుగోడు ఉప ఎన్నికలో నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక పారదర్శకంగా టెండర్ ద్వారా వచ్చిన రూ.18వేల కోట్ల విషయంలో నాపై విష ప్రచారం చేసి నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీశారంటూ మండిపడ్డారు. రాబోయే రోజుల్లో అవినీతిమయమైన కల్వకుంట్ల కుటుంబం అంతా జైలుకి వెళ్లడం ఖాయం అంటూ ఎద్దేవా చేశారు. కాగా ఈరోజు (డిసెంబర్ 21,2022) ఉదయం కవిత రాజగోపాల రెడ్డిపై సెటైర్లు వేస్తూ..అన్నా రాజగోపాల్ అన్నా..తొందరపడకు..నోజు జారకు ” 28 సార్లు ” నా పేరు చెప్పించినా ” 28 వేల సార్లు ” నా పేరు చెప్పించినా అబద్ధం నిజం కాదు.. అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు రాజగోపాల్ రెడ్డి అంతే సెటైరిగ్ గా కౌంటరిచ్చారు.
నిజం నిప్పులాంటిది చెల్లెమ్మ. నువ్వు లిక్కర్ స్కాం లో ఉన్నది నిజం, జైలుకి వెళ్లడం ఖాయం. నిన్ను మీ అన్న మీ నాయనా ఎవ్వరు కాపాడలేరు. మునుగోడు ఉప ఎన్నికలలో నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక @KTRTRS(#TwitterTillu) ఇంకా మీ తెరాస నాయకులు పారదర్శకరంగా టెండర్ ద్వారా వచ్చిన 18000 కోట్ల 1/2 https://t.co/xKfidkDslc
— Komatireddy Raj Gopal Reddy (@krg_reddy) December 21, 2022