komatireddy Rajgopal Reddy : నువ్వెంత కష్టపడ్డా కేసీఆర్ తరువాత కేటీఆరే.. నువ్వు కాదని తెలుసుకో : హరీశ్‌రావుపై రాజగోపాల్ రెడ్డి సెటైర్లు

అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టు కాకపుట్టిస్తోంది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది.

komatireddy Rajgopal Reddy Vs Harish Rao : పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసింది. దీనిపై చర్చ జరుగుతున్న సమయంలో విమర్శలు, ప్రతి విమర్శలు వాడీ వేడిగా జరిగాయి. శ్వేతపత్రంలో లెక్కలన్నీ తప్పుల తడకేనంటూ విమర్శించారు హరీశ్ రావు. పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ క్రమంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హరీశ్ విమర్శలను అడ్డుకున్నారు. దీంతో హరీశ్ రావు నువ్వెంతగా నిలబడి మాట్లాడినా మంత్రివికాలేవు.. అంటూ ఎద్దేవా చేశారు. దీంతో హరీశ్‌రావుపై రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేస్తూ.. హరీశ్ రావుకు ఎంత సమయం ఇచ్చినా సరిపోదని.. ఎందుకంటే ఆయనకు మేనమామ కేసీఆర్ పోలికలు వచ్చాయని మాటలు చెప్పటంలోను.. అబద్దాలను నిజంలా మార్చి చెప్పటంలో కేసీఆర్ పోలికలే హరీశ్ రావుకు వచ్చాయి అంటూ సెటైర్లు వేశారు. తాను మాట్లాడుతుంటే హరీశ్ రావు తనను ఇష్టానుసారంగా మాట్లాడారని.. నువ్వు ఎంతగా మాట్లాడినా నీకు మంత్రి పదవి రాదు అని అన్నారని.. తనకు మంత్రి పదవి ఇవ్వాలో వద్దో.. మా ముఖ్యమంత్రి, అధిష్టానం నిర్ణయం తీసుకుంటారు.. కానీ హరీశ్ రావు మాత్రం ఎంత కష్టపడ్డా.. కేసీఆర్ తరువాత కేటీఆర్ తప్ప హరీశ్ రావు మాత్రం కాదని.. ఈ విషయం తెలుసుకోవాలి అంటూ కౌంటర్ ఇచ్చారు. హరీశ్ రావు ఎంత కష్టపడ్డా తండ్రీకొడులు కేసీఆర్, కేటీఆర్ వాడుకుంటున్నారు తప్ప అక్కడ న్యాయం జరగదు అంటూ కౌంటరిచ్చారు.

Also Read: కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపించాలన్న హరీశ్ రావు.. నీళ్లమీద వ్యాపారం చేసిన ఘనత మీదేనంటూ సీఎం రేవంత్ కౌంటర్

కాగా.. అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టు కాకపుట్టిస్తోంది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. కాళేశ్వరాన్ని 80వేల కోట్లతో కట్టామనడం అబద్దమన్న సీఎం రేవంత్‌ అంటుంటే.. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలంటూ హరీశ్‌రావు సవాల్‌ విసిరారు. అలాగే ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక శ్వేతపత్రంపై అధికార-విపక్షాల మధ్యమాటల యుద్ధం కొనసాగుతోంది. లెక్కలను తమకు అనుకూలంగా రాసుకున్నారని BRS అంటుంటే.. లెక్కలు తేలుస్తాం అంటూ ప్రతిపక్షానికి కౌంటర్ ఇస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం.