Telangana Assembly 2023 : కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపించాలన్న హరీశ్ రావు.. నీళ్లమీద వ్యాపారం చేసిన ఘనత మీదేనంటూ సీఎం రేవంత్ కౌంటర్

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది.అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసిన సందర్భంగా విమర్శలు, ప్రతివిమర్శలతో సభ దద్దరిల్లింది.

Telangana Assembly 2023 : కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపించాలన్న హరీశ్ రావు.. నీళ్లమీద వ్యాపారం చేసిన ఘనత మీదేనంటూ సీఎం రేవంత్ కౌంటర్

Updated On : December 20, 2023 / 3:17 PM IST

Telangana Assembly 2023 : కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగింది అంటూ ఎన్నికల ప్రచారం నుంచి నేటి వరకు కాంగ్రెస్ బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తునే ఉంది. అసెంబ్లీ సమావేశాల్లో గత పదేళ్లనుంచి అధికారంలోని ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం జరిగిందని ఆరోపించింది. దీనికి సంబంధించి 42 పేజీల శ్వేతపత్రాన్ని సభలో ప్రవేశపెట్టింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ శ్వేతపత్రాన్ని సభలో ప్రవేశపెట్టారు. దీనిపై చర్చ సందర్భంగా అధికార ప్రతిపక్షాల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు వాడీ వేడిగా జరిగాయి.

దీంట్లో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మాట్లాడుతు..తమ ప్రభుత్వ హయాంలో ప్ర్రగతిభవన్ కట్టినా..ప్రాజెక్టులు కట్టినా ప్రజల కోసమే కట్టామని..కానీ తమపై ప్రభుత్వం బురద చల్లటానికే చూస్తోందని…శ్వేతపత్రంలో కూడా అన్ని తప్పులే ఉన్నాయని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని..మేటిగడ్డ విషయంలో కూడా బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని అవినీతి జరిగిందీ అంటే..సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి అని డిమాండ్ చేశారు. విచారణ జరిపిస్తే అన్ని వాస్తవాలు బయటకు వస్తాయన్నారు.

దీనికి సీఎం రేవంత్ రెడ్డి హరీశ్ రావుకు కౌంటర్ ఇస్తు..తొమిదేళ్లుగా కేసీఆర్ కుటుంబ సభ్యులే సాగునీటి మంత్రులుగా ఉన్నారని..ఇప్పటికీ ప్రజల్ని మభ్యపెట్టేందుకు యత్నిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ వారు లీడర్లు కాదు రీడర్లు అంటూ మాట్లాడుతున్నారని..మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కార్పొరేషన్ల ద్వారా రూ.97,449 కోట్ల లోన్లకు అనుమతులు తీసుకున్నారని..కానీ కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.79,287 కోట్ల లోను విడుదల అయ్యిందని వివరించారు. ఈ ప్రాజెక్టు విషయంలో అప్పులు తీసుకునేటప్పుడు పరిశ్రమలకు, వ్యవసాయానికి అన్ని అవసరాలకు నీటిని అమ్ముతామని..దాని వల్ల సంవత్సరానికి రూ.5,199 కోట్లు వస్తాయని చెప్పారు..కానీ తప్పుడు నివేదికలతో ఆర్థిక సంస్థలను మోసంన చేసి రుణాలు తెచ్చుకున్నాని విమర్శించారు. అలా బీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్లమీద వ్యాపారం చేసింది అంటూ కౌంటర్ ఇచ్చారు.