Komatireddy Venkat Reddy: తీన్మార్ మల్లన్నలాంటి వాళ్ల గురించి మాట్లాడితే నా విలువ తగ్గుతుంది: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

ఇప్పుడు ఒక్క ఎన్నికలో గెలిచి బండి సంజయ్ ఏదో సాధించామన్నట్లు మాట్లాడుతున్నారని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.

Komatireddy Venkat Reddy: తీన్మార్ మల్లన్నలాంటి వాళ్ల గురించి మాట్లాడితే నా విలువ తగ్గుతుంది: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

Telangana Minister Komati Reddy Venkat Reddy

Updated On : March 6, 2025 / 4:26 PM IST

తీన్మార్ మల్లన్నలాంటి వాళ్ల గురించి మాట్లాడితే తన విలువ తగ్గుతుందని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఇవాళ హైదరాబాద్‌లో కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు.. మల్లన్న చేసిన ఆరోపణలపై క్రమశిక్షణ కమిటీ స్పందిస్తుందని తెలిపారు.

కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇంకా భ్రమలోనే ఉన్నారని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. తదుపరి పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్ 200 ఎంపీ సీట్లకు పైగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఆబ్ కి బార్ 400 నినాదం ఇచ్చిన బీజేపీ 240 సీట్లకే పరిమితమైనప్పుడు బండి సంజయ్ ఏం చేశారని కోమటిరెడ్డి నిలదీశారు. 400 సీట్లు అన్న బీజేపీకి 300 సీట్లు కూడా రాలేదని విమర్శించారు. దేశ ప్రజలే బీజేపీ కి గిఫ్ట్ ఇచ్చారని చెప్పారు.

Also Read: కేరళ నుంచి క్యాడవర్ డాగ్స్‌.. టన్నెల్‌లోకి సింగరేణి, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు

ఇప్పుడు ఒక్క ఎన్నికలో గెలిచి బండి సంజయ్ ఏదో సాధించామన్నట్లుగా మాట్లాడుతున్నారని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. నల్లధనం తీసుకొచ్చి ప్రతి ఒక్కరి అకౌంట్లో డబ్బులు వేస్తామని చెప్పిన మోదీ ఈ విషయాన్ని మర్చిపోయారని అన్నారు.

దేశంలో రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇప్పటికి ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చారో బండి సంజయ్ చెప్పాలని నిలదీశారు. మాజీ సీఎం వైఎస్సార్ నిర్మించిన బిల్డింగ్ ను బాగు చేసి చేసి ప్రభుత్వ గెస్ట్ హౌస్ గా మార్చామని అన్నారు.

కేంద్ర సర్కారు నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే సీఎంలు, మంత్రులు, ఉన్నతాధికారులు, సుప్రీంకోర్టు జడ్జిలు ఇక్కడ ఉండేలా ఏర్పాట్లు చేశామని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. గెస్టులకు ఇంటికి వచ్చిన ఫీలింగ్ లా ఉండాలని స్టేట్ గెస్ట్ హౌస్ ను ఏర్పాటు చేశామని తెలిపారు.