Komatireddy Venkat Reddy
Komatireddy Venkat Reddy – Congress : కాంగ్రెస్ తెలంగాణ (Telangana) ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇవాళ ఢిల్లీలో తమ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ(Priyanka Gandhi)తో సమావేశమయ్యారు. దాదాపు 10 నిమిషాల పాటు చర్చించారు. జులై 7 తర్వాత తెలంగాణలో ప్రియాంక గాంధీ పర్యటించనున్నారు.
ఈ నేపథ్యంలో ఆ విషయంతో పాటు తెలంగాణ ఎన్నికలు, భట్టి విక్రమార్క చేస్తోన్న పాదయాత్రపై వారిద్దరు చర్చించినట్లు తెలుస్తోంది. అనంతరం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పార్టీని వీడిన వారంతా కాంగ్రెస్ లోకి మళ్లీ వస్తారని తెలిపారు.
” మీ సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Raj Gopal Reddy) తిరిగి కాంగ్రెస్ లోకి వస్తారా? ” అని విలేకరులు ప్రశ్నిస్తే అందరూ వస్తారని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. తాను పదవులు ఆశించడం లేదని తెలిపారు. స్టార్ కంపెయినర్ గా ప్రియాంక గాంధీని రాష్ట్రానికి రావాలని ప్రచారాల్లో పాల్గొనాలని ఆహ్వానించానని చెప్పారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు రెండు లేదా మూడు నెలల ముందే 60 శాతం సీట్ల ప్రకటన ఉంటుందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ప్రతి పదిరోజులకు ఒకసారి పర్యటించాలని తాను ప్రియాంక గాంధీని విజ్ఞప్తి చేశానని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించేలా ప్రచారం ఉండాలని కోరామని తెలిపారు.
ఈ సందర్భంతగా ప్రియాంక గాంధీ కొన్ని సూచనలు చేశారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. తెలంగాణ నుంచి వీలైనన్ని అధికంగా ఎంపీ స్థానాలు గెలవడం, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పడేలా పనిచేయాలని చెప్పారని అన్నారు. కర్ణాటక ఎన్నికల్లో పోరాడిన విధంగానే తెలంగాణాలో పోరాడాలని సూచించారని తెలిపారు. తెలంగాణ సమస్యలు తనకు తెలుసని ప్రియాంక గాంధీ చెప్పారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.
Ponnam Prabhakar: దేశానికి రెండో రాజధాని హైదరాబాద్.. ఇది ఎన్నికల స్టంటా? పొన్నం ప్రభాకర్ ఏమన్నారు?