Kottagudem Municipal Chairperson : పార్టీ నేతలే అవమానించారంటూ.. కన్నీళ్లు పెట్టుకున్న కొత్తగూడెం మున్సిపల్ ఛైర్‌పర్సన్‌

కేంద్రం తీరుకు నిరసనగా కొత్తగూడెంలో టీఆర్ఎస్ నేతలు బైక్ ర్యాలీ నిర్వహించారు. అయితే బైక్‌ ర్యాలీలో మహిళా కౌన్సిలర్ల భర్తలు ఆకతాయిల్లా తనను వేధించారని ఆమె ఫిర్యాదు చేశారు.

Kottagudem Municipal Chairperson : పార్టీ నేతలే అవమానించారంటూ.. కన్నీళ్లు పెట్టుకున్న కొత్తగూడెం మున్సిపల్ ఛైర్‌పర్సన్‌

Sitamahalakshmi

Updated On : April 8, 2022 / 6:30 PM IST

Kottagudem Municipal Chairperson : భద్రాద్రి కొత్తగూడెం టీఆర్ఎస్‌లో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. పార్టీ నేతలే అవమానించారంటూ ఎమ్మెల్యే వనమా ముందు మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ కాపు సీతామహాలక్ష్మి కన్నీరు పెట్టుకున్నారు. తన బాధను చెప్పుకుంటూ ఆవేదన చెందారు.

కొత్తగూడెంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పార్టీ నేతలు అనుచితంగా ప్రవర్తించారని వాపోయారు. కేంద్రం తీరుకు నిరసనగా కొత్తగూడెంలో టీఆర్ఎస్ నేతలు బైక్ ర్యాలీ నిర్వహించారు. అయితే బైక్‌ ర్యాలీలో మహిళా కౌన్సిలర్ల భర్తలు ఆకతాయిల్లా తనను వేధించారని ఆమె ఫిర్యాదు చేశారు.

MP Kavita-Shankar Nayak : ఎంపీ కవితకు అవమానం..మాట్లాడుతుండగా మైక్‌ లాక్కున్న ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌

వెనుక నుంచి బైకులతో ఢీ కొట్టి అగౌరవపరిచారని మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ ఆరోపించారు. తనకు ఎన్నో అవమానాలు జరుగుతున్నాయని…అయినా తట్టుకుంటున్నానని గోడు వెల్లబోసుకున్నారు.