KTR: ఈడీ విచారణకు కేటీఆర్.. భారీ బందోబస్తు

దాదాపు 200 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు.

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ గండిపేటలోని నివాసం నుంచి ఈడీ ఆఫీసుకు వచ్చారు. ఫార్ములా ఈ-కారు రేసులో ఆయనపై విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుపై కేటీఆర్‌ను ఈడీ ప్రశ్నిస్తోంది.

హెచ్ఎండీఏ ఖాతా నుంచి విదేశీ సంస్థకు నిధుల బదిలీపై ఈడీ ప్రశ్నలు వేస్తోంది. విదేశీ సంస్థకు రూ.45.7 కోట్ల బదిలీ వ్యవహారంపై ఆరా తీయనుంది. బషీర్‌బాగ్‌లోని ఈడీ ఆఫీసు వద్ద భారీ బందోబస్తు చేపట్టారు.

దాదాపు 200 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. ఈ కేసులో విచారణకు జనవరి 7న ఆయన హాజరుకావాల్సి ఉన్నప్పటికీ విచారణకు రాలేనని చెప్పారు. దీంతో ఇవాళ విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు పంపడంతో ఆయన ఆ ఆఫీసుకు వెళ్లారు.

ఇప్పటికే అధికారులు అర్వింద్‌ కుమార్, బీఎల్‌ఎన్‌ రెడ్డిని ఈడీ విచారించింది. కొన్ని రోజుల క్రితం ఏసీబీ తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టి వేసేలా ఆదేశించాలంటే కేటీఆర్‌ దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. అనంతరం దాన్ని సవాలు చేస్తూ వేసిన పిటిషన్‌ను డిస్మిస్డ్‌ యాజ్‌ విత్‌డ్రాన్‌గా సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.

‘హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌’ను మూసివేస్తున్నాం: కంపెనీ ఫౌండర్‌ నాథన్‌ అండర్సన్‌