×
Ad

Video: కేటీఆర్‌ వద్దకు వెళ్లి కబ్జా సమస్యలు చెప్పుకున్న మొగులయ్య.. కేటీఆర్ వెంటనే కలెక్టర్‌కు ఫోన్‌ చేసి.. 

మొగులయ్య భూమికి, ఆయన కుటుంబానికి తగిన రక్షణ కల్పించాలని కలెక్టర్‌కు కేటీఆర్ సూచించారు.

KTR: పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్యకు తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఇంటి స్థల సమస్య, కంటి చికిత్స బాధ్యత తీసుకున్నారు కేటీఆర్. తాను కట్టుకున్న ఇంటి గోడలను కబ్జాదారులు కూల్చి వేస్తున్నారని మొగులయ్య ఆవేదన వ్యక్తం చేశారు.

తనకు గత ప్రభుత్వం ఇచ్చిన భూమిని కాపాడి, తమ కుటుంబానికి అండగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ తనను గుర్తించడం, తనకు అండగా నిలబడటం వల్లనే ఈరోజు తనకు గౌరవం దక్కిందని మొగులయ్య అన్నారు.

గత ప్రభుత్వం తనకు హయత్ నగర్ మండలంలో కేటాయించిన 600 గజాల స్థలం విషయంలో కొంతమంది వ్యక్తుల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నట్లు మొగులయ్య చెప్పారు. ఇబ్బందులు, కోర్టు కేసుల వివరాలను కేటీఆర్‌కు వివరించారు.

Also Read: కవిత కొడుకు రాజకీయాల్లోకి ఎంట్రీ? కుండబద్దలు కొట్టినట్లు చెప్పేసిన కవిత.. బంద్‌లో ఎందుకు పాల్గొన్నాడంటే?

దీనిపై తక్షణమే స్పందించిన కేటీఆర్.. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు. మొగులయ్యకు గతంలో భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం కేటాయించిన భూమి విషయంలో కొందరు వ్యక్తులు కోర్టుల్లో కేసులు వేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని కలెక్టర్‌కు తెలిపారు.

ఈ సమస్యను వెంటనే పరిష్కరించి, మొగులయ్యకు న్యాయం చేయాలని కేటీఆర్ కోరారు. అలాగే, మొగులయ్య ఆ స్థలంలో కట్టుకున్న గదిని కూడా కొంతమంది కూల్చివేసిన పరిస్థితి ఉందని మొగులయ్య చెప్పారని పేర్కొన్నారు.

మొగులయ్య భూమికి, ఆయన కుటుంబానికి తగిన రక్షణ కల్పించాలని కలెక్టర్‌కు కేటీఆర్ సూచించారు. అవసరమైతే, మొగులయ్యకు ఎదురవుతున్న న్యాయపరమైన కేసులను ఎదుర్కొనేందుకు కూడా సహాయం అందిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.