అర్ధరాత్రి 300 మంది పోలీసులను పంపి రైతులను అరెస్ట్ చేస్తారా?: కేటీఆర్ ఆగ్రహం
"భూమిని నమ్ముకున్న మా పొట్ట కొట్టవద్దన్నందుకు అరెస్టులా?" అని కేటీఆర్ ప్రశ్నించారు.

KTR
అరెస్టులతో లగచర్ల లడాయిని ఆపలేరు అంటూ తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. “బెదిరింపులతో రైతులను భయపెట్టలేరు. అర్ధరాత్రి 300మంది పోలీసులను పంపి రైతులను అరెస్ట్ చేస్తారా? రైతులు ఏమైనా తీవ్రవాదులు అనుకుంటున్నారా? ఇదేనా ప్రజాస్వామ్య పాలనా? రైతు సంక్షేమ పాలన? ఇదేనా వెలుగులను తరిమేసి.. చీకట్లు తెచ్చిన ఇందిరమ్మ రాజ్యం?” అని కేటీఆర్ నిలదీశారు.
“అర్ధరాత్రి అన్నదాతల అరెస్టులు ఎందుకు? ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేసి.. పచ్చని పొలాలను వల్లకాడు చేయవద్దన్నందుకు రైతుల అరెస్టులా? మీ అల్లుడు, సోదరుల సంపాదనల కోసం.. భూమిని నమ్ముకున్న మా పొట్ట కొట్టవద్దన్నందుకు అరెస్టులా?” అని కేటీఆర్ ప్రశ్నించారు.
“రైతుల అరెస్టులను ఖండిస్తున్నాం.. పోలీసుల చర్యలను వ్యతిరేకిస్తున్నాం. లగచర్ల గ్రామస్తుల పోరాటానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ ఇస్తున్నా” అని కేటీఆర్ చెప్పారు. కాగా, వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో సోమవారం ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన అధికారులపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి గత అర్ధరాత్రి కొందరిని పోలీసులు అరెస్టు చేశారు.
అరెస్టులతో లగచర్ల లడాయిని ఆపలేరు!
బెదిరింపులతో రైతులను భయపెట్టలేరు!అర్దరాత్రి 300మంది పోలీసులను పంపి రైతులను అరెస్ట్ చేస్తారా?
రైతులు ఏమైనా తీవ్రవాదులు అనుకుంటున్నారా?
ఇదేనా ప్రజాస్వామ్య పాలనా?రైతు సంక్షేమ పాలన?
ఇదేనా వెలుగులను తరిమేసి.. చీకట్లు తెచ్చిన ఇందిరమ్మ రాజ్యం !…— KTR (@KTRBRS) November 12, 2024
Pawan Kalyan: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న పవన్ కల్యాణ్