అందాల పోటీల మీదే కాదు.. అగ్ని ప్రమాదాల మీద కూడా ఫోకస్ పెట్టండి.. ఫైరింజన్లు వచ్చాయి కానీ వాటర్ లేదు: కేటీఆర్

"సిబ్బందికి సరైన మాస్కులు లేవు. హైదరాబాదులో ఇదే అత్యంత భారీ అగ్ని ప్రమాదం" అని అన్నారు.

KTR

తెలంగాణ ప్రభుత్వం అందాల పోటీల మీదే కాకుండా అగ్ని ప్రమాదాల మీద కూడా ఫోకస్ పెట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌, పాతబస్తీలోని గుల్జార్‌ హౌజ్‌ వద్ద కేటీఆర్ అగ్నిప్రమాద ప్రాంతాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. “అగ్ని ప్రమాదంలో మరో ప్రాణం పోకుండా చూడండి. రాజకీయంగా మాట్లాడడానికి నేను రాలేదు. ప్రభుత్వాలు ప్రజల ప్రాణాలు కాపాడాలి. రూ.5 లక్షల పరిహారం ఇవ్వడం కాదు.. ప్రాణాలపై దృష్టి పెట్టాలి. రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి.

Also Read: “ఇందిర సౌర గిరి జల వికాసం” పథకం ప్రారంభం.. దీని ప్రయోజనాలు ఏంటి? లబ్ధిదారులు ఎవరు?

ముఖ్యమంత్రే హోం మంత్రిగా ఉన్నారు కాబట్టి ఘటనా స్థలానికి వస్తే అధికారులు ఇంకా బాగా పనిచేసేవారు. ఎండాకాలం వచ్చే ముందు అగ్నిమాపక సిబ్బందితో ప్రభుత్వం సమీక్ష సమావేశాలు నిర్వహించాలి. ఫైర్ ఇంజన్లు వచ్చాయి కానీ వాటర్ లేదు.

సిబ్బందికి సరైన మాస్కులు లేవు. హైదరాబాదులో ఇదే అత్యంత భారీ అగ్ని ప్రమాదం. నిన్నటి రోజుని దుర్భరమైన రోజుగా పేర్కొంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు” అని కేటీఆర్ చెప్పారు.

కాగా, గుల్జార్‌ హౌజ్‌ వద్ద ఘోర అగ్ని ప్రమాదం జరిగి 17 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మృతులు అందరూ ఒకే కుటుంబానికి చెందినవారు.