Telangana Elections 2023: బీఆర్ఎస్ నుంచి టికెట్ దక్కించుకోలేకపోయిన నేతల గురించి కేటీఆర్ ఏమన్నారో తెలుసా?

తనకు సిరిసిల్ల నుంచి మరోసారి పోటీ చేసే అవకాశం ఇచ్చిన బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కు కృతజ్ఞతలు చెబుతున్నట్లు పేర్కొన్నారు.

KTR

Telangana Elections 2023 – KTR: తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS Party) నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితా విడుదల కావడంతో.. టికెట్ దక్కని వారు నిరాశ చెందుతున్నారు. మొత్తం 12 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల పేర్లు అందులో కనపడలేదు. వారిలో నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మరోసారి టికెట్ ఇవ్వడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. టికెట్ రానివారి గురించి కేటీఆర్ ట్వీట్ చేశారు.

బీఆర్‌ఎస్‌ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులకు అభినందనలు తెలుపుతున్నానని కేటీఆర్ అన్నారు. తనకు సిరిసిల్ల నుంచి మరోసారి పోటీ చేసే అవకాశం ఇచ్చిన బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కు కృతజ్ఞతలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. మన నిరాశ ప్రభావం ప్రజాజీవితంపై పడకుండా దాన్ని సున్నితంగా ఎదుర్కోవాలని అన్నారు.

దురదృష్టవశాత్తు కృశాంక్‌ లాంటి కొందరు సమర్థవంతమైన నేతలకు అభ్యర్థుల జాబితాలో చోటు దక్కలేదని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం దక్కని కృశాంక్‌‌తో పాటు అలాంటి మరికొందరు నేతలకు భవిష్యత్తులో మరో రూపంలో ప్రజలకు సేవ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తామని చెప్పారు. కాగా, టీఎస్‌ఎండీసీ ఛైర్మనే ఈ కృశాంక్‌.

ఎమ్మెల్యే మైనంపల్లి కామెంట్స్‌పై
తెలంగాణ మంత్రి హరీశ్‌రావుపై ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా హరీశ్ చాలా మందిని అణిచివేశారని అన్నారు. అలాగే, హరీశ్‌ ను కూడా అణిచివేసేది తానేనని హెచ్చరించారు. తనకు, తన కుమారుడికి ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్‌ ఇవ్వకపోతే తాము ఇండిపెండెంట్ గా పోటీ చేస్తామని అన్నారు.

చివరకు ఆయనకు ఒక్కడికే టికెట్ దక్కింది. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ… తామంతా హరీశ్ రావు వెంటే ఉంటామని చెప్పారు. తమ పార్టీ ఆవిర్భావం నుంచి హరీశ్ రావు ఉన్నారని గుర్తు చేశారు. తమ పార్టీ మూలస్తంభంగా హరీశ్ రావు కొనసాగుతారని ట్వీట్ చేశారు. మైనంపల్లి వ్యాఖ్యలను కేటీఆర్ ఖండించారు.

Telangana Elections 2023: కేసీఆర్ అభ్యర్థుల జాబితా ప్రకటించగానే.. వీరి సంబరాలు మామూలుగా లేవుగా

ట్రెండింగ్ వార్తలు