దమ్మున్న ముఖ్యమంత్రి ఉంటే పెట్టుబడులు భారీగా వస్తాయి

  • Publish Date - November 20, 2020 / 05:59 PM IST

ktr hyderabad: గ్రేటర్ ఎన్నికల కదన రంగంలోకి దిగారు మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హైదరాబాద్ ప్రగతి నివేదికను ఆయన విడుదల చేశారు. కార్పొరేషన్ ఎన్నికల్లో 150 డివిజన్లలో పోటీ చేస్తున్నట్టు తెలిపారు. 150 సీట్లలో 50శాతం సీట్లు బీసీలకు కేటాయించామన్నారు కేటీఆర్. మహిళలకు 85 సీట్లు, మైనార్టీలకు 17 సీట్లు, గిరిజనులకు మూడు సీట్లు కేటాయించామన్నారు. ఏపీ నుంచి హైదరాబాద్ కు వచ్చి స్థిరపడిన వారిలో 8మందికి సీట్లు ఇచ్చామన్నారు. సీట్ల కేటాయింపులో అన్ని కులాలకు ప్రాతినిధ్యం కల్పించామన్నారు కేటీఆర్. అన్ని వర్గాలకు న్యాయం చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని కేటీఆర్ చెప్పారు.

గ్రేటర్ లో ఉన్న ఆంధ్రా వాళ్లను అన్నదమ్ముల్లా చూశామన్నారు కేటీఆర్. 24 గంటల నాణ్యమైన విద్యుత్ కేసీఆర్ వచ్చాకే సాధ్య పడిందన్నారు కేటీఆర్. హైదరాబాద్ కు పెట్టుబడులు వరదలా వస్తున్నాయని చెప్పారు. ఇప్పటివరకు 2లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. దమ్మున్న ముఖ్యమంత్రి ఉండి, శాంతిభద్రతలు సరిగా ఉంటేనే పెట్టుబడులు భారీగా వస్తాయన్నారు కేటీఆర్. 2014 నుంచి 2020 వరకు 67వేల 149.23 కోట్లు ఖర్చు చేశామన్నారు. తెలంగాణ వచ్చాక పేకాట క్లబ్బులు లేవు ఆ గబ్బు లేదు.. ఆకతాయిల ఆగడాలు లేవు, కమ్యూనల్ టెన్షన్లు లేవున్నారు కేటీఆర్. మంచి నీటి సమస్య 95శాతం పరిష్కారం అయ్యిందన్నారు.