KTR: అందుకే “మెట్రో రైలు” నుంచి ఎల్‌ అండ్‌ టీ సంస్థను రేవంత్‌ రెడ్డి వెళ్లగొట్టారు: కేటీఆర్‌ సంచలనం

"కుటుంబ సభ్యులకు ఆ సంస్థ భూములను పంచడానికే రేవంత్‌ రెడ్డి ఆరాటపడుతున్నారు. ఫ్యూచర్ లేని ఫ్యూచర్ సిటీకి రేవంత్ రెడ్డి ఎయిర్ పోర్ట్ నుంచి మెట్రో వేస్తారంటా" అని కేటీఆర్ అన్నారు.

KTR: అందుకే “మెట్రో రైలు” నుంచి ఎల్‌ అండ్‌ టీ సంస్థను రేవంత్‌ రెడ్డి వెళ్లగొట్టారు: కేటీఆర్‌ సంచలనం

KTR

Updated On : September 26, 2025 / 6:32 PM IST

KTR: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచనారాహిత్యంగా, బాధ్యతారాహిత్యంగా కక్షగట్టి మెట్రో రైలు నుంచి ఎల్‌ అండ్‌ టీ సంస్థను వెళ్లగొట్టిందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎల్‌ అండ్‌ టీ సంస్థపై ఉదేశపూర్వకంగానే కక్ష పెంచుకున్నారని వ్యాఖ్యానించారు.

“మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన పిల్లర్లను తామే నిర్మిస్తామని ఎల్‌ అండ్‌ టీ సంస్థ ముందుకు వచ్చిందని, అప్పటి నుంచి ఆ సంస్థపై రేవంత్ కక్ష పెంచుకున్నారని కేటీఆర్ చెప్పారు. అప్పట్లో వైఎస్సార్ పీపీటీ పద్ధతిలో మెట్రోను ప్రారంభించారని తెలిపారు. ప్రపంచంలోనే అతి పెద్ద పీపీటీ పద్ధతిలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మెట్రో రైలు ప్రాజెక్టును ఎల్‌ అండ్‌ టీకి అప్పగించిందని చెప్పారు.

కేసీఆర్‌ ప్రజా రవాణాకు పెద్దపీట వేసి మెట్రో మొదటి కారిడార్ 69 కి.మీ పూర్తి చేసి ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించారు. మైట్రో రెండో కారిడార్‌కు శంకుస్థాపన చేశాం. ఎల్ అండ్‌ టీ సంస్థనే పనులు చేయడానికి ముందుకు వచ్చింది.

Also Read: సింగరేణి కార్మికులకు మరో శుభవార్త.. ఒక్కొక్కరికి బోనస్ ఎంతంటే? కిషన్‌ రెడ్డి ప్రకటన..

వైఎస్సార్ దూర దృష్టితో ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మెట్రో టైన్ ట్రాక్ కి భూమిని సేకరించారు. 400 కి.మీ మెట్రో పనులకు కేసీఆర్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దశల వారీగా మెట్రో రైలును విస్తారించాలని ప్రణాళికలు సిద్ధం చేశాం. రేవంత్ రెడ్డి పిచ్చి ఆలోచనలతో దాన్ని రద్దు చేశారు. 2070 వరకు హైదరాబాద్ మెట్రోలో ఎల్‌ అండ్‌ టీ సంస్థ పీపీటీగా ఉంది.

ఎందుకు ఆ సంస్థ మెట్రో రైలు ప్రాజెక్ట్ నుంచి నిష్కమించిందో రేవంత్ చెప్పాలి. ఎల్‌ అండ్ టీ సంస్థకు చెందిన 285 ఎకరాల భూములపై రేవంత్ రెడ్డి కన్ను వేశారు. కుటుంబ సభ్యులకు ఆ సంస్థ భూములను పంచడానికే రేవంత్‌ రెడ్డి ఆరాటపడుతున్నారు.

ఫ్యూచర్ లేని ఫ్యూచర్ సిటీకి రేవంత్ రెడ్డి ఎయిర్ పోర్ట్ నుంచి మెట్రో వేస్తారంటా. ట్రాఫిక్ రద్దీని, ఐటీ ఉద్యోగులను దృష్టిలో పెట్టుకొని రహేజా ఐటీ పార్క్ నుంచి శంషాబాద్ వరకు మెట్రో రైలు ను విస్తరించాలి. మెట్రో నుండి ఎల్‌ అండ్‌ టీ సంస్థ వైదొలగడంతో 15 వేల కోట్ల రూపాయల భారం ప్రజలపై పడనుంది.

పీపీటీ ప్రాజెక్ట్ నుంచి ఎల్‌ అండ్‌ టీ సంస్థ వైదొలగడంపై క్యాబినెట్ భేటీలో చర్చించారా? దీనిపై కేంద్రం జోక్యం చేసుకొని విచారణ చేయాలి. మెట్రోపై ప్రభుత్వ వైఖరిపై ఆసెంబ్లీ సమావేశం నిర్వహించి చర్చించాలి” అని డిమాండ్ చేశారు.

నన్ను అరెస్ట్ చేసుకోండి.. నాకు భయం లేదు: కేటీఆర్

పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ కు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. “నా అరెస్ట్ పై కాంగ్రెస్ నేతలు కలలు అంటున్నారు. నా అరెస్ట్ కోసం కాంగ్రెస్ నేతలు కళ్లుకాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. నన్ను అరెస్ట్ చేసుకోండి. నాకు అరెస్ట్ భయం లేదు. నా‌ అరెస్ట్ తో రేవంత్ కు పైశాచిక ఆనందం తప్ప మరొకటి రాదు. నేను ఏ తప్పూ చేయలేదు. ఏం చేసుకుంటారో చేసుకోండి.

నాతో రేవంత్ రెడ్డి లై డిటెక్టర్ టెస్ట్ కు రావాలి. ఆర్ఎస్(రేవంత్, సంజయ్) బ్రదర్స్ కు ప్రజా సమస్యలు పట్టవు. ఆర్ఎస్ బ్రదర్స్ కు.. నేను ఏ కారులో తిరుగుతున్నానో‌ మాత్రమే కావాలి. కారుల విషయంలో నేను తప్పు చేస్తే కేంద్రం చర్యలు తీసుకోవచ్చు” అని తెలిపారు.

“జూబ్లీహిల్స్ లో మాగంటి సునీత మంచి మెజారిటీతో గెలవబోతున్నారు. హైదరాబాద్ ప్రజల ఆశీర్వాదం కేసీఆర్ కు ఉంది. హైదరాబాద్ లో మొన్న గెలిచాం.. నిన్న గెలిచాం.. రేపూ గెలుస్తాం. హైడ్రా పెద్ద వాళ్లకు చుట్టం.. పేదలకు భూతం. వివేక్, కేవీపీ రామచంద్రరావు, తిరుపతి రెడ్డిల‌ ఇళ్లను హైడ్రా ఎందుకు కూల్చదు?” అని కేటీఆర్ నిలదీశారు.